Attention: CSIR-UGC NET June 2021 హాల్‌ టికెట్లు విడుదల.. ఎలా డౌన్‌లోడ్‌ చేయాలంటే..

|

Feb 15, 2022 | 6:18 AM

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ CSIR-UGC NET (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్) జూన్ 2021 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది..

Attention: CSIR-UGC NET June 2021 హాల్‌ టికెట్లు విడుదల.. ఎలా డౌన్‌లోడ్‌ చేయాలంటే..
Net Csir
Follow us on

CSIR-UGC NET June 2021 examination admit cards: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ CSIR-UGC NET (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్) జూన్ 2021 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం ఈ పరీక్షలు ఫిబ్రవరి 15, 16, 17 తేదీలలో జరుగుతుంది. సీబీటీ విధానంలో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ csirnet.nta.nic.inలో అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఎన్టీఏ నిర్వహించే CSIR-UGC NET జూన్ 2021 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), లెక్చర్‌షిప్ (LS)/అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధిస్తారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు సంబంధించని హాల్‌టికెట్లు పోస్ట్‌లో పంపించబడవు. వెబ్‌సైట్ నుంచి తప్పనిసరిగా డౌన్‌లోడ్‌ చేసుకోవల్సి ఉంటుందని ఎన్టీఏ తెల్పింది. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఎన్టీఏ హెల్ప్‌డెస్క్‌ 011 40759000 కాల్‌ చెయ్యాలి లేదా csirnet@nta.ac.inకు మెయిల్‌ చెయ్యలని తెప్పింది.

సీఎస్ఐఆర్‌ అడ్మిట్ కార్డులను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ csirnet.nta.nic.inను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌పేజీలో కనిపించే ‘Joint CSIR UGC NET June 2021 Admit Cards’ లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • అభ్యర్ధులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా లాగిన్‌ అవ్వాలి.
  • ఆ తర్వాత మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ఔట్‌ తీసుకోవాలి.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు పరీక్ష కేంద్రానికి హాల్‌టికెట్లు తీసుకెళ్లకపోతే లోపలికి ప్రవేశం ఉండదు.

Also Read:

IIT Kharagpur Jobs 2022: గేట్‌/నెట్‌ అర్హతతో..ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు..పూర్తి వివరాలివే!