NPCIL Recruitment: పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే.

|

Feb 10, 2023 | 7:52 PM

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. మహారాష్ట్రలోని తారాపూర్ కేంద్రంలో ఉన్న ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

NPCIL Recruitment: పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే.
Npcil Jobs
Follow us on

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. మహారాష్ట్రలోని తారాపూర్ కేంద్రంలో ఉన్న ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 193 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో నర్సు-ఎ (మేల్‌/ ఫిమేల్‌) (26), పాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ (సైంటిఫిక్ అసిస్టెంట్/ బి) (3), ఫార్మసిస్ట్/ బి (4), స్టైపెండరీ ట్రైనీ/ డెంటల్ టెక్నీషియన్ (మెకానిక్) (1), ఎక్స్-రే టెక్నీషియన్/ సి (1), స్టైపెండరీ ట్రైనీ/ టెక్నీషియన్ (158) పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, 10+2, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 28-02-2023ని చవరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..