NPCIL Recruitment 2021: ఐటీఐ విద్యార్థులకు గమనిక.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..

|

Nov 09, 2021 | 9:39 PM

NPCIL Recruitment 2021: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అప్రెంటీస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మొత్తం 107 పోస్టులను భర్తీ చేయనున్నారు.

NPCIL Recruitment 2021: ఐటీఐ విద్యార్థులకు గమనిక.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..
Npcil Recruitment
Follow us on

NPCIL Recruitment 2021: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అప్రెంటీస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మొత్తం 107 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేయడానికి అధికారిక వెబ్‌సైట్ npcilcareers.co.in ని సందర్శించాలి. NPCIL రిక్రూట్‌మెంట్ ప్రకారం.. దరఖాస్తు ప్రక్రియ 28 అక్టోబర్ 2021 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి 15 నవంబర్ 2021 చివరి తేదీగా నిర్ణయించారు. NPCIL జారీ చేసిన నోటిఫికేషన్‌లో శిక్షణ పొందిన అప్రెంటీస్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ జరుగుతుందని తెలిపింది.

ఇలా దరఖాస్తు చేసుకోండి..
1. దరఖాస్తు చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్ npcilcareers.co.inకి వెళ్లాలి
2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో తారాపూర్ మహారాష్ట్ర సైట్‌లోని ట్రేడ్ అప్రెంటిస్‌ల లింక్‌పై క్లిక్ చేయాలి.
3. ఈ దరఖాస్తు ఫారమ్ పేజీకి వెళ్లాలి.
4. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
5. రిజిస్ట్రేషన్ తర్వాత దరఖాస్తు ఫారమ్ నింపాలి.
6. దరఖాస్తు పూర్తయిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

ఖాళీలు..
1. ప్లంబర్ – 15
2. కార్పెంటర్ – 14
3. ఎలక్ట్రీషియన్ – 28
4. ఎలక్ట్రానిక్ మెకానిక్ – 15
5. ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ – 13
6. వైర్‌మ్యాన్ – 11
7. పెయింటర్ – 15
8. ఫిట్టర్ – 26
9. టర్నర్ – 10
10. మెషినిస్ట్ – 11
11. హౌస్ కీపర్ – 3

అర్హత & వయో పరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత పనిలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు పరిమితి 14 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ
ఐటీఐలో అన్ని సెమిస్టర్లలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికకు ముందు అభ్యర్థులందరూ స్కిల్ డెవలప్‌మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వెబ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం కూడా అవసరం.

మీకు ఎంత జీతం వస్తుంది?
NPCIL జారీ చేసిన నోటీసు ప్రకారం.. ఒక సంవత్సరం ITI కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు నెలకు 7,700 రూపాయల గౌరవ వేతనం రెండేళ్ల ITI కోర్సు పూర్తి చేసిన వారికి నెలకు 8,855 రూపాయల గౌరవ వేతనం లభిస్తుంది.

చలికాలంలో మీకు దాహం వేయకపోవచ్చు.. కానీ కచ్చితంగా నీరు తాగాలి.. లేదంటే మీ పని అంతే..

Peruvian Family: కుక్క అనుకుని పెంచుకుంటే.. 6 నెలల తర్వాత అసలు విషయం తెలిసి షాక్..

Anasuya Bharadwaj: రేపు పుష్ప నుంచి మరో అప్‌డేట్‌.. అనసూయ ఫస్ట్‌లుక్ ను విడుదల చేయనున్న చిత్రబృందం