NPCIL Stipendiary Trainee Operator Admit Card 2022: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) నరోరా అటామిక్ పవర్ స్టేషన్‌లోని స్టైపెండరీ ట్రైనీ ఆపరేటర్ (కేటగిరీ-II) పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ npcilcareers.co.inలో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఎన్‌పీసీఐఎల్ మొత్తం 72 స్టైపెండరీ ట్రైనీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయడానికి గాను ప్రిలిమినరీ పరీక్షను ఈ నెల (మార్చి) 26న నిర్వహించనుంచి. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమై 10 గంటల వరకు కొనసాగుతుంది. ఈ పరీక్ష తర్వాత స్టేజ్ 2 అడ్వాన్స్‌డ్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల 30 నిముషాల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిముషాల వరకు జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు పరీక్ష కేంద్రానికి ఉదయం 7 గంటల 30 నిముషాలకు చేరుకుని, రిపోర్టు చేయవల్సి ఉంటుంది. కాగా పరీక్ష ఓఎమ్‌ఆర్ షీట్/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో ఉంటుంది. ప్రలిమినరీ పరీక్షలో మొత్తం 50 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు ఒక గంటలో సమాధానాలు గుర్తించవల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.
NPCIL అడ్మిట్ కార్డ్ 2022 ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..
Also Read: