Noval Dockyard Vizag: వైజాగ్‌ నావల్ డాక్‌యార్డులో 275 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్‌.. ముఖ్యమైన తేదీలు ఇవే..

|

Nov 22, 2023 | 11:15 AM

విశాఖపట్నంలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (నేవీ), నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్‌.. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబందిత ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఐటీఐలో ఉత్తీర్ణత పొంది విద్యార్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 281 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పైప్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, ఫౌండ్రీమ్యాన్, పెయింటర్, ఆర్‌ అండ్‌ ఎ/సి మెకానిక్, వెల్డర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, షీట్ మెటల్ వర్కర్ ట్రేడుల్లో..

Noval Dockyard Vizag: వైజాగ్‌ నావల్ డాక్‌యార్డులో 275 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్‌.. ముఖ్యమైన తేదీలు ఇవే..
Noval Dockyard Visakhapatna
Follow us on

విశాఖపట్నంలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (నేవీ), నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్‌.. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబందిత ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఐటీఐలో ఉత్తీర్ణత పొంది విద్యార్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 281 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పైప్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, ఫౌండ్రీమ్యాన్, పెయింటర్, ఆర్‌ అండ్‌ ఎ/సి మెకానిక్, వెల్డర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, షీట్ మెటల్ వర్కర్, కార్పెంటర్, మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడులో ఐటీఐలో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి.

దరఖాస్తుదారుల వయసు 14 నుంచి 21 సంవత్సరాలు మధ్య ఉండాలి. అంటే మే 2, 2010 తర్వాత జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అప్రెంటిస్‌లకు ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో నెలకు రూ.7,700 నుంచి రూ.8,050 వరకు స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు జనవరి 1, 2024వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. నింపిన దరఖాస్తులను కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించాలి.

ఇవి కూడా చదవండి

ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ. స్కిల్ టెస్ట్‌..లలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

అడ్రస్‌..

The Officer-in-Charge (for Apprenticeship), Naval Dockyard Apprentices School, VM Naval Base S.O., P.O., Visakhapatnam – 530 014, Andhra Pradesh.

ముఖ్య తేదీల వివరాలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 1, 2024.
  • రాత పరీక్షల తేదీ: ఫిబ్రవరి 28, 2024.
  • రాత పరీక్ష ఫలితాల ప్రకటన తేదీ: మార్చి 2, 2024.
  • ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 5 నుంచి 8వ తేదీ వరకు, 2024
  • ఇంటర్వ్యూ ఫలితాల వెల్లడి తేదీ: మార్చి 14, 2024.
  • వైద్య పరీక్షల తేదీ: మార్చి 1, 2024.
  • ట్రైనింగ్‌ ప్రారంభం: మే 2, 2024 నుంచి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.