Anganwadi Job Notification: గుడ్‌న్యూస్‌.. 14 వేల అంగన్‌వాడీ పోస్టులకు ముహూర్తం ఫిక్స్.. మంత్రి సీతక్క వెల్లడి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ వారంలోనే 14 వేలకు పైగా అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయబోతోంది. ఈ మేరకు రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియడంతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేయనున్నారు. ఇతర పూర్తి వివరాలు ఈ కింద తెలుసుకోవచ్చు..

Anganwadi Job Notification: గుడ్‌న్యూస్‌.. 14 వేల అంగన్‌వాడీ పోస్టులకు ముహూర్తం ఫిక్స్.. మంత్రి సీతక్క వెల్లడి
Minister Seethakka

Updated on: Mar 03, 2025 | 5:55 PM

హైదరాబాద్‌, మార్చి 3: తెలంగాణ రాష్ట్ర స్త్రీశిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క గుడ్‌న్యూస్‌ చెప్పారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో లక్ష మందితో సభ నిర్వహిస్తామని తెలిపారు. ఇదే రోజు 14,236 అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. మొత్తం పోస్టుల్లో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 6,399, హెల్పర్‌ పోస్టులు 7,837 ఉన్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై శనివారం మంత్రి సీతక్క సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

మార్చి 8న పరేడ్‌ మైదానంలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. దేశంలోనే అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందిస్తామని, పలు రాష్ట్రాల్లో చేపట్టిన మహిళా సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. కాగా అంగన్‌వాడీ టీచర్‌, హెల్పర్‌ పోస్టులకు కనీసం ఇంటర్‌ పాసై ఉండాలన్న నిబంధన ఈసారి ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చింది. అలాగే ఈ పోస్టుల భర్తీకి వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్లు నిండిన వివాహిత మహిళలు మాత్రమే అర్హులు. నోటిఫికేషన్‌ వచ్చాక ఆసక్తి కలిగిన వివాహిత మహిళలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ లాసెట్‌ 2025 దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష ఎప్పుడంటే?

తెలంగాణ లా కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నిర్వహించే లాసెట్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ఆలస్యంగా ప్రారంభమయ్యింది. మార్చి 1వ తేదీన సాయంత్రం 4గంటల తర్వాత దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. షెడ్యూల్‌ ప్రకారం ఆ రోజు మధ్యాహ్నం నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకావాల్సి ఉండగా, ఉదయం నుంచే అభ్యర్థులు కంప్యూటర్ల ముందు పడిగాపులు కాశారు. దీంతో తొలిరోజు కేవలం 30 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్‌ 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. తెలంగాణ లాసెట్, పీజీఎల్‌సెట్‌ పరీక్షలు జూన్‌ 6వ తేదీన జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.