
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (APSWREIS) ఆధ్వర్యంలోని డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాలు, డా.బీఆర్ అంబేడ్కర్ ఐఐటీ-మెడికల్ అకాడమీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 5వ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులు, 6 నుంచి 10వ తరగతి బ్యాక్‌లాగ్ ఖాళీల్లో ప్రవేశాలకు BRAG CET 2026 రాత పరీక్ష నిర్వహించనుంది. అర్హులైన బాలబాలికలు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 19, 2026వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా విద్యార్ధులకు సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు వసతి, క్రీడలు, వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారు.
దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2025-26 విద్యాసంవత్సరంలో నాలుగో తరగతి చదువుతూ ఉండాలి. ఇతర తరగతులకు 6వ, 7వ, 8వ, 9వ, 10వ తరగతి చదువుతూ ఉండాలి. ఐదో తరగతికి విద్యార్థి వయస్సు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆగస్ట్ 31, 2026 నాటికి 13 ఏళ్లు, ఇంటర్‌కు 19 ఏళ్లకు మించకుండా ఉండాలి. జనరల అభ్యర్ధులకు 5వ తరగతికి 11 ఏళ్లు, ఇంటర్‌కు 17 ఏళ్లలోపు వయసు ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2,50,000 మించకూడదు. ఈ అర్హతలు ఉన్న వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం సీట్లలో రిజర్వేషన్ వర్గాలకు అంటు ఎస్సీ విద్యార్థులకు 75% సీట్లు కేటాయిస్తారు. దరఖాస్తు ఫీజు కింద రూ.100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.
ఏపీ గురుకుల ప్రవేశాల 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.