Education: విద్యార్థుల‌కు స‌ద‌వ‌కాశం.. అస్స‌లు మిస్ చేసుకోకండి..

| Edited By: Narender Vaitla

Aug 04, 2024 | 6:55 AM

విశాఖ కేంద్రంగా పనిచేసే తూర్పు నావికా దళం పరిధిలో సీ క్యాడెట్ కార్ప్స్ - ఎస్సీసీ లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. ఆగస్టు 1, 2012 నుంచి జూలై 31,2014 మధ్య జన్మించి 5,6,7 తరగతులు చదువుతున్న బాలబాలికలు ఈ ప్రవేశానికి అర్హులు. దరఖాస్తు ఫారమ్‌లు INS సర్కార్స్, కమాండ్ స్విమ్మింగ్...

Education: విద్యార్థుల‌కు స‌ద‌వ‌కాశం.. అస్స‌లు మిస్ చేసుకోకండి..
Follow us on

విశాఖ కేంద్రంగా పనిచేసే తూర్పు నావికా దళం పరిధిలో సీ క్యాడెట్ కార్ప్స్ – ఎస్సీసీ లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. ఆగస్టు 1, 2012 నుంచి జూలై 31,2014 మధ్య జన్మించి 5,6,7 తరగతులు చదువుతున్న బాలబాలికలు ఈ ప్రవేశానికి అర్హులు. దరఖాస్తు ఫారమ్‌లు INS సర్కార్స్, కమాండ్ స్విమ్మింగ్ పూల్ వద్ద ఆదివారం 04 ఆగస్టు 2024, ఉదయం 8 నుండి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు ఫారమ్‌లను తీసుకునేటప్పుడు అభ్యర్థులు ఫోటో ID ప్రూఫ్, స్టడీ సర్టిఫికేట్, పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్‌ను సమర్పించాలి. పురించిన దరఖాస్తు ఫారమ్‌లను 11 ఆగస్టు 24, ఆదివారం ఉదయం 08 నుండి 11 గంటల వరకు తీసుకున్న చోటే సమర్పించాలి.

ఎలా ఎంపిక చేస్తారంటే..

రా త పరీక్ష, ఫిజికల్ టెస్ట్, మౌఖిక పరీక్ష 18 ఆగస్టు 24 ఆదివారం నాడు నిర్వహించబడతాయి. ఎంపిక కోసం వచ్చే అభ్యర్థులు తమ స్కూల్ యూనిఫాంలో ఉండాలి. సూచించిన ప్రదేశంలో తల్లిదండ్రులతో కలిసి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు కాల్ లెటర్‌లు 08 సెప్టెంబర్ 24న లేదా అంతకు ముందు వారి చిరునామాకు పంపబడతాయి. 2024 బ్యాచ్ కోసం శిక్షణ సెప్టెంబర్‌ 15న ప్రారంభమవుతుంది.

సీ క్యాడెట్ కార్ప్స్ అంటే..

సీ క్యాడెట్ కార్ప్స్ అనేది 10 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సు గల పాఠశాలకు వెళ్లే యువ బాలబాలికలకు శిక్షణనిచ్చే స్వచ్ఛంద యువజన సంస్థ. స్క్వాడ్ డ్రిల్, రైఫిల్ డ్రిల్, రైఫిల్ షూటింగ్, స్విమ్మింగ్, బోట్ పుల్లింగ్, బ్యాండ్, సెమాఫోర్, రిగ్గింగ్, సీమాన్‌షిప్ , మొదలైన విభాగాల్లో శిక్షణ ఉంటుంది. ప్రతి ఆదివారం ఉదయం 07:30 నుండి మధ్యాహ్నం 1200 ప్రత్యేక తరగతులు నిర్వహించబడతాయి. ఇక్కడ అందించిన శిక్షణ అభ్యర్థులకు స్వీయ-క్రమశిక్షణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీవితంలో వారి సంబంధిత లక్ష్యాలను సాధించడంలో వారికి నమ్మకంగా ఉంటుంది. అలాగే, వారికి రక్షణ దళాల గురించి అవగాహన, జీవితంలో అదే వృత్తిగా తీసుకోవడానికి ఈ శిక్షణ ప్రత్యేకంగా సహాయపడుతుంది.