NCL Recruitment 2021: కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న వేళ భారత్‌లోని పలు ప్రభుత్వ సంస్థలు డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నార్తర్న్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ (ఎన్‌సీఎల్).. డాక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులను తీసుకోనున్నారు.
* ఈ నోటిఫికేన్ ద్వారా మొత్తం 56 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో 45 జీడీఎంఓ, 11 స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులు ఉన్నాయి.
* జీడీఎంఓ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/స్టేట్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/కాలేజ్‌లో ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* ఇక స్పెషలిస్ట్ డాక్టర్ల విషయానికొస్తే.. ఇందులో 11 ఖాళీల్లో భాగంగా అనెస్తెటిస్ట్ 3, మెడిసిన్ 5, సర్జన్ 3 పోస్టులను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. మూడేళ్ల పోస్టు క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.
* ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. కరోనా నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూను వీడియో కాన్ఫరెన్స్ (వర్చువల్) విధానంలో నిర్వహించనున్నారు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు.. ఈమెయిల్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్ మేనేజర్(పర్సనల్), ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లిష్‌మెంట్ డిపార్ట్‌మెంట్, ఎన్‌సీఎల్ హెడ్‌క్వార్టర్ సింగరౌలి, కోలరీ డిస్ట్రిక్–సింగరౌలి–486889 చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
* ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ పంపించాలనుకునే వారు gmee.ncl@coalindia.inకి పంపించాలి.
* దరఖాస్తులకు 15.05.2021 ని చివరి తేదిగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం www.nclcil.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Also Read: Oil India Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు