NMDC Hyderabad Jobs 2022: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో.. హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..

|

Nov 09, 2022 | 9:59 PM

భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌.. 11 జాయింట్‌ కంపెనీ సెక్రటరీ, అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్‌, జూనియర్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

NMDC Hyderabad Jobs 2022: ఇంటర్‌/డిగ్రీ అర్హతతో.. హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..
NMDC Hyderabad Recruitment 2022
Follow us on

భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌.. 11 జాయింట్‌ కంపెనీ సెక్రటరీ, అసిస్టెంట్‌ జనరల్ మేనేజర్‌, జూనియర్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. లా, పర్సనల్‌, కెమికల్, ఎన్విరాన్‌మెంట్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌/గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/పీజీడిగ్రీ/పీజీ డిప్లొమా/ఎమ్మెస్సీ/ఎంఏ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 24, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో అభ్యర్ధులందరూ తప్పనిసరిగా రూ.500లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.2.6 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.