NLC India Recruitment 2022: నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అకర్షణీయ జీతంతో కేంద్ర కొలువులు..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NLC India Limited Tamil Nadu).. స్పెషలిస్ట్‌ డాక్టర్ పోస్టుల (Specialist Doctor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

NLC India Recruitment 2022: నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అకర్షణీయ జీతంతో కేంద్ర కొలువులు..
Nlc India

Updated on: Jun 29, 2022 | 6:56 PM

NLC India Specialist Doctor Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన తమిళనాడులోని నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NLC India Limited Tamil Nadu).. స్పెషలిస్ట్‌ డాక్టర్ పోస్టుల (Specialist Doctor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 16

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • స్పెషలిస్ట్‌ డాక్టర్ పోస్టులు: 12
  • జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్ పోస్టులు: 4

విభాగాలు: నియోనాటాలజీ, అనెస్తీషియాలజీ, రేడియాలజీ, గైనకాలజీ అండ్‌ అబ్‌స్టెట్రిక్స్, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్, జనరల్‌ మెడిసిన్‌/ జీరియాట్రిక్‌ మెడిసిన్, పాథాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

అర్హతలు: పోస్టును బట్టి ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ లేదా డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 15, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.