NIT Srinagar Recruitment 2022: ఎమ్మెస్సీ/ పీహెచ్‌డీ అర్హతతో.. నిట్‌లో 41 అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

|

Feb 15, 2022 | 8:21 AM

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌ (Srinagar)లోనున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT) స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ ద్వారా టీచింగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

NIT Srinagar Recruitment 2022: ఎమ్మెస్సీ/ పీహెచ్‌డీ అర్హతతో.. నిట్‌లో 41 అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..
Nit Srinagar
Follow us on

NIT Srinagar Special Recruitment Drive 2022: భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌ (Srinagar)లోనున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT) స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ ద్వారా టీచింగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 41

పోస్టుల వివరాలు: ఫ్యాకల్టీ పోస్టులు

ఖాళీల వివరాలు:

  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు: 31
  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు: 7
  • ప్రొఫెసర్‌ పోస్టులు: 3

విభాగాలు: కెమికల్‌ ఇంజనీరింగ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్, కెమిస్ట్రీ, హ్యూమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇతర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 60 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్‌/బీఈ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో టీచింగ్‌ అనుభవం కూడా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ.1000లు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూ అభ్యర్ధులకు మినహాయింపు కలదు.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 20, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

GATE 2022 Results: గేట్‌ 2022 రెస్పాన్స్‌ షీట్లు విడుదల నేడే ..! ఫలితాలు ఎప్పుడంటే..