భారత ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెందిన పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లోనున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ .. 77 అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-1, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. బయో టెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత స్పెషలైజేషన్‌లో టీచింగ్ అనుభవం కూడా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 60 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 4, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం నింపిన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని కింది అడ్రస్‌కు నవంబర్ 14వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.2000లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.1000లు అప్లికేషన్ ఫీజుగా చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
అడ్రస్: Dr B R AMBEDKAR NATIONAL INSTITUTE OF TECHNOLOGY, G T Road Bye Pass, Jalandhar-144027, Punjab (India).
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.