NILD Senior Resident Recruitment 2022: భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన కోల్‌కతాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటార్ డిజేబిలిటీస్ (Divyangajan).. ఒప్పంద ప్రాతిపదికన 33 సీనియర్ రెసిడెంట్, కన్సల్టెంట్, న్యూరాలజిస్ట్, ఫిజియోథెరపిస్ట్ తదితర (Senior Resident Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ, డిప్లొమా, ఇటర్మీడియట్, బీఎస్సీ, ఎంఏ, రీహాబిలిటేషన్ సైన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 40 ఏళ్లకు మించకుండా ఉండాలి. అర్హత కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో నోటిఫికేషన్ విడుదలైన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ సెప్టెంబర్ 2, 2022వ తేదీన విడుదలైంది. జనరల్/ఓబీసీ అభ్యర్ధులు రూ.300లు దరఖాస్తు రుసుము చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు అప్లికేషన్ పీజు మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్:
అడ్రస్: Director, National Institute for Locomotor Disabilities (Divyangjan), B.T. Road, Bon-Hooghly, Kolkata-700090.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.