NIH Roorkee Resource Person Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఉత్తరప్రదేశ్‌లోని రూర్కీలోనున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ (NIH).. రిసోర్స్ పర్సన్, రిసెర్చ్ అసోసియేట్ తదితర పోస్టుల (Resource Person Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: రిసోర్స్ పర్సన్, రిసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్‌ఎఫ్), సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్ పోస్టులు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.20,000ల నుంచి రూ.55,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ/ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్/మాస్టర్స్ డిగ్రీ/పీహెచ్‌డీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే యూజీసీ నెట్/గేట్‌లో వ్యాలిడ్ ర్యాంక్ కూడా ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం అవసరం.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాలి.
ఇంటర్వ్యూ తేదీ: జులై 28, 29 తేదీల్లో, 2022.
అడ్రస్: Ministry of Jal Shakti, Department of Water Resources, River Development and Ganga Rejuvenation, Jalvigyan Bhawan, Roorkee , Uttarakhand– 247 667.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.