NHB Recruitment: నేషనల్ హార్టికల్చర్‌ బోర్డ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 50 వేలు జీతం..

|

Dec 30, 2022 | 8:30 AM

హార్టీ కల్చర్‌ లేదా అగ్రికల్చర్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారికి సదవకాశం. నేషనల్‌ హార్టికల్చర్‌ బోర్డ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగంలో పుల పోస్టుల భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

NHB Recruitment: నేషనల్ హార్టికల్చర్‌ బోర్డ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 50 వేలు జీతం..
Nhb Recruitment
Follow us on

హార్టీ కల్చర్‌ లేదా అగ్రికల్చర్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారికి సదవకాశం. హరియాణా రాష్ట్రం గురుగ్రామ్‌లోని నేషనల్‌ హార్టికల్చర్‌ బోర్డ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగంలో పుల పోస్టుల భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (హార్టికల్చర్/ పోస్ట్-హార్వెస్ట్ టెక్నాలజీ/ అగ్రికల్చర్ ఎకనామిక్స్/ అగ్రికల్చర్ ఇంజినీరింగ్/ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్/ ఫుడ్ టెక్నాలజీ/ ఫుడ్ సైన్సెస్). లేదా బీఎస్సీ(హార్టికల్చర్‌/ అగ్రికల్చర్), ఎంబీఏ (అగ్రి బిజినెస్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో అనుభవం, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను అకడమిక్‌ అర్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 50,000 జీతంగా చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 09-01-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

* ఇంటర్వ్యూలను 24-01-2023 తేదీన నిర్వహించనున్నారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..