NFSU Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో.. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో కొలువులు..నేరుగా ఇంటర్వ్యూ..

|

Jun 07, 2022 | 8:02 PM

భారత ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీకి చెందిన త్రిపుర క్యాంపస్ (NFSU).. ఒప్పంద ప్రాతిపదికన డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల (Deputy Section Officer Posts) భ‌ర్తీకి అర్హులైన..

NFSU Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో.. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో కొలువులు..నేరుగా ఇంటర్వ్యూ..
Nfsu
Follow us on

NFSU Tripura Deputy Section Officer Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీకి చెందిన త్రిపుర క్యాంపస్ (NFSU).. ఒప్పంద ప్రాతిపదికన డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల (Deputy Section Officer Posts) భ‌ర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 4

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.35,000 నుంచి రూ.40,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి బీఈ/బీటెక్‌(సివిల్), మాస్టర్స్ డిగ్రీ(సైన్స్/ లా/ మేనేజ్‌మెంట్)లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

అడ్రస్: సర్దార్ పటేల్ బోర్డ్ రూమ్, ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ-త్రిపుర క్యాంపస్, రాధానగర్, వీఐపీ రోడ్, అగర్తల, త్రిపుర.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.

ఇంటర్వ్యూ తేదీ: జూన్‌ 14, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.