NFDB Hyderabad Jobs 2023: హైదరాబాద్‌లోని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్షలేకుండా ఎంపిక..

|

Apr 16, 2023 | 2:19 PM

హైదరాబాద్‌లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు.. ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హిందీ, ఐటీ విభాగాల్లో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు..

NFDB Hyderabad Jobs 2023: హైదరాబాద్‌లోని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్షలేకుండా ఎంపిక..
NFDB Hyderabad
Follow us on

హైదరాబాద్‌లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు.. ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హిందీ, ఐటీ విభాగాల్లో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఫిషరీస్‌ సైన్స్‌/అక్వాకల్చర్‌/మారికల్చర్‌/మరైన్‌ బయాలజీ/ఇండస్ట్రియల్‌ ఫిషరిస్‌/జువాలజీలో మాస్టర్స్ డిగ్రీ, సివిల్‌ ఇంజనీరింగ్‌/ఫిషరిస్‌ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌, హిందీ స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 40 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్న వారు ఆఫ్‌లైన్‌ విధానంలో మే 4, 2023వ తేదీలోపు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. పూర్తి సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్..

ఎన్‌ఎఫ్‌డీబీ, ఫిష్ బిల్డింగ్, పిల్లర్ నెం.235, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే, ఎస్‌వీఎన్‌పీఏ పోస్టు, హైదరాబాద్‌

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.