NFDB Hyderabad Recruitment 2022: పాడి పరిశ్రమల మంత్రిత్వాశాఖకు చెందిన హైదరాబాద్‌-నేషనల్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డులో ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..

|

Oct 20, 2022 | 7:38 AM

భారత ప్రభుత్వ మత్స్య పరిశ్రమ, పశు పోషణ, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ (ఎన్‌ఎఫ్‌డీబీ).. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్‌ (గ్రేడ్‌ 1, 2) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

NFDB Hyderabad Recruitment 2022: పాడి పరిశ్రమల మంత్రిత్వాశాఖకు చెందిన హైదరాబాద్‌-నేషనల్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డులో ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..
NFDB Hyderabad
Follow us on

భారత ప్రభుత్వ మత్స్య పరిశ్రమ, పశు పోషణ, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని నేషనల్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ (ఎన్‌ఎఫ్‌డీబీ).. ఒప్పంద ప్రాతిపదికన 9 కన్సల్టెంట్‌ (గ్రేడ్‌ 1, 2) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టెక్నికల్‌, ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్‌, అడ్మినిస్ట్రేషన్‌, ఫైనాన్స్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, టెక్నికల్‌ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిరటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ బీఈ/ బీటెక్‌/ బీకామ్‌/ సీఏ, ఫిషరీస్‌ సైన్స్‌/ ఆక్వాకల్చర్‌/ మెరికల్చర్‌/ మెరైన్‌ బయోలజీ/ ఇండస్ట్రీయల్‌ ఫిషరీస్‌/ జువాలజీ/ హెచ్‌ఆర్‌/ మేనేజ్‌మెంట్‌ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు అక్టోబర్‌ 1, 2022వ తేదీ నాటికి 35 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఎవరైనా ఆఫ్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 2, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.32,000ల నుంచి రూ.53,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫకేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్:

Senior Executive (F&A) I/c, National Fisheries Development Board, Pillar No: 235, PVNR Expressway, SVPNPA Post, Hyderabad -500 052, Telangana.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.