సబ్జెక్టులో రాటు దేలితేనే ర్యాంకు.. సరికొత్త గుణపాఠం నేర్పిన JEE మెయిన్ 2026 పరీక్షలు!

పెరుగుతున్న పోటీ దృష్ట్యా ప్రస్తుత కాలంలో ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షల తీరు తెన్నులు మారుతున్నాయి. ఈ విధానం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న జేఈఈ మెయిన్స్‌ పరీక్షల తీరులో స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే విధానం మునుముందు ఈఏపీసెట్‌లోనూ కనిపించే ప్రమాదం లేకపోలేదు. అందుకు కారణం తెలంగాణ ఈఏపీసెట్‌కు కొత్త సిలబస్‌ రాబోవడమే..

సబ్జెక్టులో రాటు దేలితేనే ర్యాంకు.. సరికొత్త గుణపాఠం నేర్పిన JEE మెయిన్ 2026 పరీక్షలు!
New Trend Questions In Entrance Exams

Updated on: Jan 24, 2026 | 5:24 PM

హైదరాబాద్‌, జనవరి 24: రాష్ట్ర వ్యాప్తంగా 2026లో ఇంటర్‌ అడ్మిషన్‌ పొందిన విద్యార్ధులు కొత్త సిలబస్‌తోనే ఈసారి EAPCET పరీక్షలు రాయబోతున్నారు. ఈ దిశగా తెలుగు అకాడమీ కసరత్తు చేస్తోంది. మరోవైపు ప్రవేశ పరీక్షల తీరుపై జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ) కొన్ని మార్గదర్శకాలను ఇప్పటికే జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్న జేఈఈ సిలబస్‌లో మార్పులు చేశారు. ఇదే బాటలో అన్ని రాష్ట్రాలూ ప్రవేశ పరీక్షల సిలబస్‌ను మారుస్తున్నాయి. విద్యార్థులకు సబ్జెక్టుపై పట్టు పెంచడమే ఈ మార్పు ప్రధాన ఉద్దేశ్యం.

మారుతున్న ప్రశ్నల సరళి..

ఎన్‌ఈపీ ప్రకారం.. పరీక్ష విద్యార్థి ఆలోచన విధానానికి అద్దం పట్టేలా ఉండాలి. ఈ మేరకు జేఈఈ ప్రశ్నల ప్యాటర్న్, మార్కింగ్, సెక్షన్లు, ప్రశ్నల రకంలో మార్పులు చేశారు. మల్టీపుల్‌ చాయిస్‌ క్వశ్చన్స్‌ ఆప్షన్లలో కీలక మార్పులు చేశా రు. చూసేందుకు దాదాపు అన్ని ఆప్షన్లు ఒకేలా ఉంటున్నాయి. దీంతో ఆయా చాప్టర్‌ల మూల సిద్ధాంతంతోపాటు, అనుబంధ సమాచారం కూడా తెలిసి ఉంటేనే క్వశ్చన్‌ పేపర్‌లో ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు పెట్టే అవకాశం ఉంటుంది. అందుకు ప్రతీ సబ్జెక్టును విశ్లేషణాత్మకంగా తెలుసుకోవాలి. అంటే.. ఫిజిక్స్‌లో ఫోలో ఎలక్ట్రిక్‌ ఎఫెక్ట్‌ చాప్టర్‌ నుంచి ప్రశ్నలను కేవలం ఇంటర్‌ సిలబస్ నుంచి మాత్రమే ఇవ్వరు. ఫొటో ఎలక్ట్రిక్‌ ద్వారా వివిధ పరిశోధనలు, వస్తున్న మార్పుల నుంచి కూడా ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం కనుగొనాలంటే విద్యార్థి ఇంటర్‌లో ఆ చాప్టర్‌ పాఠం చదవడంతోపాటు తాజాగా వస్తున్న సరికొత్త ట్రెండ్, పారిశ్రామికంగా దాన్ని వాడే విధానం, మార్పులను గుర్తించాల్సి ఉంటుంది.

ఇక ఇదే విధానాన్ని మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్, కెమిస్ట్రీలోనూ ఫాలో చేస్తున్నారు. ఎప్పుడూ మూస విధానంలోనే కాకుండా ఐటీలో వాడుతున్న లాంగ్వేజ్‌ లెర్నింగ్‌ మాడ్యూల్స్‌ను రూపొందించే స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. టెక్ట్స్‌ బుక్స్, పాఠాలను మాత్రమే నమ్ముకుంటే ర్యాంకు అసాధ్యమన్నమాట. ఇలా ప్రిపరేషన్‌ సాగించిన వారికి మాత్రమే జేఈఈ మెయిన్‌లో మెరుగైన ర్యాంకు వస్తుంది. జేఈఈ మెయిన్‌లో ఈ ఏడాది వచ్చిన ప్రశ్నలన్నీ ఇదే విధంగా విశ్లేషణాత్మకంగా వచ్చాయి. సబ్జెక్టుపై పట్టున్న వారే ఎక్కువ మార్కులు పొందేలా క్వశ్చన్‌ పేపర్‌ను రూపొందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పైపై కాదు.. మూలాల్లోకి వెళ్లి చదవాల్సిందే!

అయితే ఈ మారిన ట్రెండ్‌ను ఈ ఏడాది పరీక్షలు రాస్తున్న విద్యార్ధులు సకాలంలో గుర్తించలేదు. అలవాటు ప్రకారం గతంలో మాదిరిగానే సన్నద్ధమయ్యారు. ఆన్‌లైన్‌ పరీక్షలు కాబట్టి విద్యార్థులంతా ఈసారి బోల్తా కొట్టారు. మ్యాట్రిక్స్, క్యాల్యుక్యులేషన్స్‌లో ఏఐ ఆధారిత మ్యాథ్స్‌ విధానం నుంచి ఈసారి మరిన్ని ప్రశ్నలు వచ్చాయి. ఫిజిక్స్‌లో గందరగోళంగా ఒకేలా అనిపించే ఆన్స ర్లు వస్తున్నాయి. ఇలా దాదాపు 40 శాతం జేఈఈ ప్రశ్నలు భిన్నంగా వచ్చాయి. ఈ గందరగోళం నుంచి బయటపడి ప్రశ్నలకు సులువుగా సమాధానాలు పెట్టాలంటే సబ్జెక్టులో రాటు దేలితేలాల్సిందే అన్నట్లు పరిస్థితి మారింది. ఈఏపీసెట్‌ పరీక్షలు రాసే విద్యార్ధులు ఈ మార్పులు దృష్టిలో ఉంచుకుని సన్నద్ధమైతే బెస్ట్ స్కోర్ సాధించొచ్చు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.