భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన మేఘాలయలోని షిల్లాంగ్‌లోనున్న నార్త్‌ఈస్టర్న్ ఇందిరాగాంధీ రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ (నైగ్రిమ్స్).. ఒప్పంద ప్రాతిపదికన 37 సీనియర్ రెసిడెంట్ డాక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అనెస్తీషియాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, మైక్రోబయాలజీ, న్యూరోసర్జరీ, ఆప్తల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, ఫార్మాకాలజీ, రేడియోథెరపీ, ఫార్మకాలజీ, యూరాలజీ, న్యూరాలజీ, జనరల్ మెడిసిన్, బయోకెమిస్ట్రీ, జనరల్ సర్జరీ తదితర విభాగాల్లో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్టేట్ మెడికల్ కౌన్సిల్ లేదా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 45 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్న వారు సంబంధిత డాక్యుమెంట్లతో కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నవంబర్ 22, 23, 24 తేదీల్లో నేరుగా హాజరుకావచ్చు. అర్హులైన వారికి నెలకు రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
Conference Hall, NEIGRIHMS Guest House, Permanent Campus, Mawdiangdiang, Shillong-793018.
ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.