భారత ప్రభుత్వా ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన నార్త్ ఈస్టర్న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ హోమియోపతి.. ఒప్పంద/ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 15 ఫైనాన్స్ మేనేజర్, ప్రిన్సిపల్, డిప్యూటీ డైరెక్టర్, మెడికల్ సూపరింటెండెంట్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్, రేడియాలజిస్ట్, అనెస్తెటిస్ట్, సర్జికల్ స్పెషలిస్ట్, పీడియాట్రీషియన్, నర్సింగ్ ఆఫీసర్, ల్యాబొరేటరీ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, ఎంబీఏ, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ, పోస్టు గ్రాడ్యుయేసన్, ఎంహెచ్‌ఏ లేదా తత్సమాన కోర్సులోఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 25 నుంచి 56 యేళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో నోటిఫికేషన్ విడుదలైన 45 రోజుల్లోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు ఖచ్చితంగా రూ.1400లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులు రూ.700 అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.15,600ల నుంచి రూ.67,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌చేసుకోవచ్చు.
The Director,
North Eastern Institute of Ayurveda & Homoeopathy (NEIAH),
MAWDIANGDIANG, SHILLONG, MEGHALAYA – 793018.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.