దేశంలో గుర్తింపు పొందిన వైద్య కళాశాలల్లో MBBS ప్రవేశాల కోసం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET) ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. పరీక్ష రాసిన అభ్యర్థులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న NEET ఫలితాల్ని సెప్టెంబర్ 7వ తేదీన ప్రకటించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA ప్రకటించింది. ఫలితాలను ప్రకటించిన తర్వాత అభ్యర్థులు తమ సంబంధిత NEET UG 2022 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inలో చెక్ చేసుకోవచ్చు. NEET UG ఫలితంతో పాటు, ఫైనల్ ఆన్సర్ కీ, మెరిట్ జాబితా కూడా విడుదల చేయనున్నారు. NEET UG 2022ను దేశవ్యాప్తంగా ఈఏడాది జులై 17వ తేదీన నిర్వహించిన విషయం తెలిసిందే. ధరఖాస్తు చేసుకున్న మొత్తం అభ్యర్థుల్లో 95 శాతం మంది అభ్యర్థులు వైద్య విద్య ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు.
నీట్ యూజీ ఆన్సర్ కీ పై అభ్యంతరాలను లేవనెత్తెందుకు సెప్టెంబర్ 2వ తేదీ వరకు గడువు ఇవ్వగా.. ఇప్పటికే ఎంతోమంది అభ్యర్థుల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశంలోని 497 నగరాల్లోని 3,570 కేంద్రాల్లో నిర్వహించిన ఈపరీక్షలకు 18,72,343 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు neet.nta.nic.in లేదా ఇక్కడ క్లిక్ చేస్తే హోం పేజీ ఓపెన్ అవుతుంది. అందులో నీట్ యూజీ స్కోర్ కార్డ్ డౌన్ లోడ్ లింక్ క్లిక్ చేయాలి. అక్కడ మీ లాగిన్ డీటైల్స్ ఇచ్చి పలితాలను చెక్ చేసుకోవాలి. ఈఏడాది జులై 17వ తేదీన నీట్ యూజీ మెడికల్ ప్రవేశ పరీక నిర్వహించగా.. రికార్డు స్థాయిలో 18.72 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మొత్తం అభ్యర్థుల్లో 10.64 లక్షల మంది మహిళలు ఉన్నారు. NEET మెడికల్ ప్రవేశ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ల సంఖ్య 18 లక్షలను అధిగమించడం ఇదే మొదటిసారి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.