NEET UG 2024 Last Date: నీట్‌ యూజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడిగింపు… 25 లక్షలు దాటిన దరఖాస్తులు!

|

Mar 10, 2024 | 4:01 PM

దేశవ్యాప్తంగా ఉన్న పలు మెడికల్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) యూజీ 2024 పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు మార్చి 9వ తేదీ రాత్రి 9 గంటలతో ముగిసింది. కొందరు అభ్యర్ధుల విజ్ఞప్తి మేరకు నేషనల్‌ టెస్టింట్ ఏజెన్సీ తుది గడువును మార్చి 16వ తేదీ వరకు పొడిగించింది..

NEET UG 2024 Last Date: నీట్‌ యూజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడిగింపు... 25 లక్షలు దాటిన దరఖాస్తులు!
NEET UG 2024 Last Date
Follow us on

న్యూఢిల్లీ, మార్చి 10: దేశవ్యాప్తంగా ఉన్న పలు మెడికల్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) యూజీ 2024 పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు మార్చి 9వ తేదీ రాత్రి 9 గంటలతో ముగిసింది. కొందరు అభ్యర్ధుల విజ్ఞప్తి మేరకు నేషనల్‌ టెస్టింట్ ఏజెన్సీ తుది గడువును మార్చి 16వ తేదీ వరకు పొడిగించింది. దీంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారికి మరో అవకాశం లభించినట్లైంది.

కాగా మే 5న నీట్‌ యూజీ 2024 పరీక్ష నిర్వహించనున్నట్టు ఇప్పటికే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. నీట్‌ యూజీలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షను దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఆఫ్‌లైన్‌ (పెన్ను, పేపర్‌) విధానంలో నిర్వహించనున్నారు. 200 నిమిషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. మార్చి 16న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 నిమిషాల వరకు పరీక్ష ఉంటుంది. ఇక ఫలితాలు జూన్‌ 14న ప్రకటిస్తారు.

నీట్‌ యూజీ పరీక్ష వివరాలు…

నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్‌ యూజీ) 2024కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీతో సైన్స్‌లో ఇంటర్మీడియట్ లేదాప్రీ-డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి తప్పని సరిగా 17 ఏళ్లకు మించి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 16, 2024 రాత్రి 10.50 నిమిషాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదే రోజు రాత్రి 11.50 నిమిషాల వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.1700, జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్ధులు రూ.1600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, థర్డ్‌ జండర్‌ అభ్యర్థులు రూ.100 చొప్పున రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విదేశాలకు చెందిన అభ్యర్థులు రఖాస్తు రుసుం కింద రూ.9500లు చెల్లించాలి. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ తేదీ, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన వివరాలను ఎన్‌టీఏ త్వరలో వెబ్‌సైట్‌లో వెల్లడించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.