NEET UG 2022 Exam Date: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET)-2022 కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థుల సంఖ్య 18 లక్షలు దాటింది. వీరిలో 10.64 లక్షల మంది మహిళలు కావడం గమనార్హం. 8.07 మంది పురుష అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా మొత్తం 18.72 లక్షలకు పైగా అభ్యర్థులు నీట్ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈ ఏడాది జులై 17న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో 13 భాషల్లో ఎన్టీఏ నీట్ పరీక్షను నిర్వహించనుంది. ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 771 మంది విదేశీయులు, 910 మంది ప్రవాస భారతీయులు, 647 మంది ఓవర్‌సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్లు కూడా ఉన్నారు. వీరిలో అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఇంగ్లిష్‌ను పరీక్ష మాధ్యమంగా ఎంచుకోగా.. తర్వాత హిందీ, తమిళం ఉన్నాయి. నీట్ యూజీ ప్రవేశ పరీక్ష తేదీని వాయిదా వేయాలని కోరుతూ పలువురు విద్యార్థులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే ముందుగా నిర్ణయించిన ప్రకారంగానే యథాతథంగా జులై 17న పరీక్ష జరుగుతుందని ఎన్టీఏ స్పష్టం చేసింది.
కాగా గత ఏడాది నీట్ యూజీ ప్రవేశ పరీక్ష సెప్టెంబర్ 12వ తేదీన జరిగింది. దరఖాస్తు చేసుకున్న వారిలో 95 శాతం (15.44 లక్షలు) మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 3,858 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. దాదాపు 8.70 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.