NEET PG 2024 Internship Cut-Off Date: నీట్‌ పీజీ ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ పొడిగింపుకు సుప్రీం ‘నో’

నీట్‌-పీజీ 2024 పరీక్షను జూన్‌ 23న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే నీట్‌-పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ను పొడిగించాలంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రిధేశ్‌ అనే విద్యార్ధి సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే దీనిని విచారణకు తీసుకోవడానికి అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. దీనిపై వాదనలు విన్న చీఫ్‌ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కటాఫ్‌ను..

NEET PG 2024 Internship Cut-Off Date: నీట్‌ పీజీ ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ పొడిగింపుకు సుప్రీం నో
NEET PG 2024 Internship Cut-Off Date

Updated on: May 01, 2024 | 3:55 PM

అమరావతి, మే 1: నీట్‌-పీజీ 2024 పరీక్షను జూన్‌ 23న నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే నీట్‌-పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ను పొడిగించాలంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రిధేశ్‌ అనే విద్యార్ధి సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే దీనిని విచారణకు తీసుకోవడానికి అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. దీనిపై వాదనలు విన్న చీఫ్‌ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కటాఫ్‌ను పొడిగించలేమని స్పష్టం చేసింది. దీనిపై సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని అనుమతిస్తూ ధర్మాసనం పిటిషనర్‌కు సూచించింది. కాగా ఈ ఏడాది నీట్‌-పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఆగస్టు 15వ తేదీని ఇంటర్న్‌షిప్‌ కటాఫ్‌ తేదీగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.

రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కళాశాల ప్రవేశ పరీక్ష వాయిదా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను జూన్ 8వ తేదీన నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వెల్లడించింది. దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో జూన్ 1న లోక్‌సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ పరీక్ష తేదీని జూన్‌ 1వ తేదీకి బదులుగా జూన్‌ 8వ తేదీకి వాయిదా వేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌ మైనారిటీ గురుకులాల్లో 2024-25 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీ నరసింహారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఐదో తరగతితోపాటు ఎనిమిదో తరగతి, జూనియర్ కాలేజీల్లో ఫస్ట్‌ ఇయర్‌కు కూడా ప్రవేశాలు కల్పించనున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు సంబంధిత పాఠశాల, కాలేజీల్లో మే 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌లో  ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.