NEET PG Cut Off 2022 Category Wise and Score Card: నీట్ పీజీ (NEET PG 2022) ఫలితాలు జూన్ 1 (బుధవారం)న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో మొత్తం 800ల మార్కులకు గానూ విద్యార్ధులు సాధించిన మార్కుల వివరాలు, కట్‌ఆఫ్ మార్కుల జాబితాను విడుదల చేసింది. కాగా తాజాగా నీట్ పీజీ స్కోర్ కార్డులు రేపు (జూన్ 8)న విదుదలవ్వనున్నట్లు ఎన్‌బీఈ ప్రకటన విడుదల చేసింది. విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ nbe.edu.in.లో స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఆధారంతో స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కాగా ఈ ఏడాది మే 21న, 849 పరీక్ష కేంద్రాల్లో నీట్ పీజీ ప్రవేశ పరీక్ష జరుగగా.. పరీక్ష నిర్వహించిన అనంతరం కేవలం 10 రోజుల్లోనే ఫలితాలు విడుదలవ్వడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఖాళీగాఉన్న దాదాపు 42,000ల పీజీ సీట్ల కోసం నీట్ పీజీ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు ఒక ఏడాది ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన 2 లక్షల మంది ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు హాజరయ్యారు. ఈ ఏడాది నిర్వహించిన నీట్ పీజీ 2022 ప్రవేశ పరీక్షకు సంబంధించిన కట్ఆఫ్ మార్కులు కూడా విడుదలయ్యాయి. స్కోర్‌కార్డు, ఫలితాల ఆధారంగా అర్హత కలిగిన అభ్యర్థులకు NEET PG 2022 కౌన్సెలింగ్‌లో సీటు కేటాయించడం జరుగుతుంది. తాజా అప్‌డేట్ ప్రకారం.. నీట్ పీజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ 2022 ఇంకా ప్రకటించలేదు.
నీట్ పీజీ 2022 కటాఫ్‌లు ఇవే..
NEET PG scorecard 2022 ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.