NEET PG Exam 2021 Admit cards: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బీఈ) నీట్ పీజీ 2021 పరీక్షకు సబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. నీట్ పీజీ (NEET PG) ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను ఎబీఈ (National Board of Examinations) అధికారిక వెబ్‌సైట్ nbe.edu.in నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 18న జరగనుంది. వాస్తవానికి నీట్ పీజీ 2021 అడ్మిట్ కార్డులు ఏప్రిల్ 12న సోమవారమే విడుదల కావాల్సి ఉంది. అయితే సాంకేతిక లోపం కారణంగా అడ్మిట్ కార్డులను ఆ తేదీన విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఎన్‌బీఈ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. సాంకేతిక కారణాల వల్ల కార్డులను విడుదల చేయలేదని.. బుధవారం విడుదల చేస్తామని ఎన్‌బీఈ వెల్లడించింది.
ముందుగా నీట్ పీజీ అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ nbe.edu.in లోకి లాగిన్ అవ్వాలి.
నీట్ పీజీ 2021ను ఎంపిక చేసుకోవాలి
హోమ్ పేజీలో నీట్ పీజీ 2021 దరఖాస్తుదారు లాగిన్ లింక్‌పై క్లిక్ చేయాలి
రిజిస్ట్రేషన్ నెంబర్, వివరాలను నమోదు చేయాలి
అనంతరం అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోని ప్రింట్ అవుట్ తీసుకోవాలి
కాగా.. దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ఈ తరుణంలో నీట్ పరీక్షను వాయిదా వేయాలని అన్ని చోట్ల నుంచి వ్యతిరేకత వినిపించింది. అయినప్పటికీ.. నీట్ పీజీ పరీక్ష (NEET PG 2021) షెడ్యూల్ ప్రకారం యథావిధిగా జరుగుతుందని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE) స్పష్టంచేసింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో పరీక్ష నిర్వహణకు ఎన్‌బీఈ పలు మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా.. నీట్ పీజీ పరీక్షను దేశవ్యాప్తంగా 1.75 లక్షల మంది విద్యార్థులు రాయనున్నారు. 18 న మధ్యాహ్నం 2 నుంచి 5.30 గంటల వరకు ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. కాగా ఈ పరీక్ష ఫలితాలను మే 31న వెల్లడించనున్నారు.
• దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలను మరింత కఠినం చేస్తూ పలు మార్గదర్శకాలను జారీ చేసింది.
• కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే పరీక్ష కేంద్రాలను పెంచినట్లు పేర్కొంది.
• దీంతోపాటు విద్యార్థుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా.. సులువుగా ప్రయాణించేలా ఈ పాస్‌లు జారీ చేయనున్నట్లు బోర్డు తెలిపింది.
• పరీక్షా కేంద్రాల్లో ప్రవేశానికి వేరు వేరు సమయాలను కేటాయిస్తున్నట్లు పేర్కొంది. ఈ వివరాలు పరీక్ష రాసే అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్, మెయిల్ ద్వారా పంపనున్నారు.
• పరీక్షకు హాజరయ్యేవారు మాస్క్ ధరించడం, హాండ్ శానిటైజర్ ఉపయోగించడం తప్పనిసరని పేర్కొంది.
• పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు శరీర ఉష్ణోగ్రతను పరీక్షిస్తారు. ఒకవేళ వారికి టెంపరేచర్ అధికంగా ఉంటే ప్రత్యేక గదిలో పరీక్ష నిర్వహిస్తారు.
• ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాష్ట్రాలకు కూడా పలు సూచనలు చేసింది. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.
Also Read: