NVS Recruitment 2022: నవోదయ విద్యాలయ సమితి, ఎన్‌వీఎస్ వివిధ గ్రూప్ ఏ, బీ, సీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు NVS అధికారిక వెబ్‌సైట్, navodaya.gov.inను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జనవరి 12 నుంచి మొదలైంది. అభ్యర్థులు ఫిబ్రవరి 10, 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,925 పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
NVS రిక్రూట్‌మెంట్ 2022: ఖాళీల వివరాలు..
అసిస్టెంట్ కమిషనర్: 7
మహిళా స్టాఫ్ నర్స్: 82
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 10
ఆడిట్ అసిస్టెంట్: 11
జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్: 4
జూనియర్ ఇంజనీర్: 1
స్టెనోగ్రాఫర్: 22
కంప్యూటర్ ఆపరేటర్: 4
క్యాటరింగ్ అసిస్టెంట్: 87
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 630
ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: 273
ల్యాబ్ అటెండెంట్: 142
మెస్ హెల్పర్: 629
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 23
NVS రిక్రూట్‌మెంట్ 2022: దరఖాస్తు ఇలా చేయండి..
1. అధికారిక వెబ్‌సైట్navodaya.gov.inను సందర్శించండి.
2. ‘వాట్స్ న్యూ’ విభాగంలో నాన్-టీచింగ్ పోస్టుల లింక్‌పై క్లిక్ చేయాలి
3. వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవాలి.
4. ఏ పోస్ట్‌కి అప్లే చేస్తున్నారో చెక్ చేసుకుని, దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
5. దరఖాస్తు రుసుమును చెల్లించి, అప్లికేషన్ ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి.
6. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్‌అవుట్ తీసుకోవాలి.
NVS రిక్రూట్‌మెంట్ 2022: ఎంపిక ప్రక్రియలో అసిస్టెంట్ కమీషనర్, అసిస్టెంట్ కమిషనర్ (అడ్మిన్), జూనియర్ ఇంజనీర్ పోస్టులకు అప్లే చేసిన అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఇంటర్వ్యూ (సివిల్)లో వారి పనితీరు ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
NVS రిక్రూట్‌మెంట్ 2022: దరఖాస్తు ఫీజు
అసిస్టెంట్ కమిషనర్ పోస్టుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 1,500, మహిళా స్టాఫ్ నర్స్ రూ. 1,200, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్, ఎంటీఎస్ రూ. 750, ఇతర పోస్టులకు రూ. 1,000 చెల్లించాలి.