JEE Main: నేటి నుంచి (సోమవారం) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ తుది విడత పరీక్షను నిర్వహిస్తున్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీతో పాటు జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ పరీక్షను నిర్వహిస్తోంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి కనీసం గంట ముందే చేరుకోవాలని ఎన్‌టీఏ తెలిపింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రానికి అనుమతించమని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే గతేడాది జేఈఈ మెయిన్స్‌ను నాలుగు విడతలుగా నిర్వహించగా ఈ ఏడాది రెండు ఫేజ్‌ల్లోనే నిర్వహిస్తున్నారు. నేడు జరగే పరీక్షకు దేశ్యాప్తంగా మొత్తం 6,29,778 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇక ఈ ఏడాది పరీక్ష విధానాన్ని పూర్తిగా మార్చారు. గతంలో కేవలం సెక్షన్-ఏలో మాత్రమే నెగెటివ్ మార్కులుండేవి. సెక్షన్-బిలో ప్రతి ప్రశ్నకూ నెగెటివ్ మార్కు ఉంటుంది.
కరోనాతో 2021–22లోనూ పలు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు సిలబస్‌ను కుదించినా ఎన్టీఏ మాత్రం కుదించలేదు. కాకపోతే కొన్ని మినహాయింపులను ప్రకటించింది. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ, తెలుగు, ఉర్దూ సహా పలు ప్రాంతీయ భాషల్లో కూడా ఉంటాయి. ఏపీ, తెలంగాణల్లో ఇంగ్లిష్‌తో పాటు తెలుగు మాధ్యమ ప్రశ్నపత్రాలు అందించనున్నారు. ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సంబంధించిన ప్రక్రియను ఆగస్టు రెండో వారంలో మొదలవ్వనుంది. ఆగస్టు 28న పరీక్ష నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయించింది.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..