
అమరావతి, అక్టోబర్ 17: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి మెడికల్ సీట్లలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పలు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లకు అనుమతులు లభించాయి. దాదాపు 250 ఎంబీబీఎస్ సీట్లకు జాతీయ వైద్య కమిషన్ కొత్తగా అనుమతులు ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా 250 ఎంబీబీఎస్ సీట్లు పెరిగినట్లైంది. పుత్తూరు అన్నా గౌరి వైద్య కళాశాలలో 100 సీట్లను 150కు పెంచారు.
అలాగే కర్నూలు శాంతిరామ్ వైద్య కళాశాలలో 150 సీట్లను 200కు పెంచారు. ఇక విశాఖపట్నం ఎన్నారై మెడికల్ కాలేజీలోనూ ఇప్పటికే ఉన్న 150 ఎంబీబీఎస్ సీట్లను ఏకంగా 250కి పెంచుతూ తాజాగా అనుమతులు వచ్చాయి. అలాగే కర్నూలు శాంతిరామ్ మెడికల్ కాలేజీలో ఇప్పటికే 200కు పెంచిన సీట్లను సైతం మళ్లీ 250కి పెంచింది. పెరిగిన ఈ సీట్లకు లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్‌ఓపీ) రావాల్సి ఉంది. మూడో విడత కౌన్సెలింగ్‌లో పెరిగిన ఈ సీట్లను భర్తీ చేయనున్నట్లు విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేర్కొంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) 2025 టైర్ 1 రాత పరీక్ష ప్రాథమిక ఆన్సర్ కీ తాజాగా విడుదలైంది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి ఆన్స్‌ర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీతోపాటు రెస్సాన్స్‌షీట్లను కూడా కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచింది. అభ్యర్థులు అక్టోబర్ 19వ తేదీ వరకు ఆన్సర్ కీ పై అభ్యంతరాలను తెలిపేందుకు అవకాశం కల్పించారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర కీ తయారు చేసి, ఫలితాలను వెల్లడించనున్నట్లు ఎస్ఎస్సీ పేర్కొంది. కాగా ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ టైర్ 1 పరీక్షలు సెప్టెంబర్ 12 నుంచి 26 వరకు మొత్తం 15 రోజుల పాటు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఎస్ఎస్సీ సీజీఎల్ టైర్ 1 ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.