NIT Sikkim Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సిక్కింలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

|

Nov 13, 2021 | 2:45 PM

NIT Sikkim Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్ఐటీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా సిక్కింలోని ఇన్‌స్టిట్యూట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు....

NIT Sikkim Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ సిక్కింలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
Nit Sikkim Jobs
Follow us on

NIT Sikkim Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్ఐటీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా సిక్కింలోని ఇన్‌స్టిట్యూట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 14 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో రిజిస్ట్రార్, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్, టెక్నికల్‌ అసిస్టెంట్, సూపరింటెండెంట్, జూనియర్‌ అసిస్టెంట్‌ వంటి ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతితో ఐటీఐ, ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/బీటెక్‌/ఇంజనీరింగ్‌/ఎంసీఏ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వీటితో పాటు సంబంధిత కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి.

* అభ్యర్థుల వయసు 27 నుంచి 56 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని తర్వాత దరఖాస్తును, ఆఫ్‌లైన్‌ విధానంలో పంపించాల్సి ఉంటుంది.

* హార్డ్‌ కాపీని ది రిజిస్ట్రార్, నిట్‌ సిక్కిం, బర్ఫంగ్‌ బ్లాక్, రవంగలా, సౌత్‌ సిక్కిం–737139, సిక్కిం(ఇండియా) చిరునామకు పంపించాలి.

* అభ్యర్థులను రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు 06-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: చలికాలంలో జట్టు, చర్మ సమస్యలకు ఇలా చెక్ పెట్టండి

Diabetes: మధుమేహం ఉన్నవారు పంచదార తీసుకోకపోయినా శరీరంలో చక్కెర నియంత్రణలో ఎందుకు ఉండదు? పూర్తిగా తెలుసుకోండి!

PM Narendra Modi: తెగ నచ్చేసింది.. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇచ్చిన జ్ఞాపికకు ప్రధాని మోదీ ఫిదా..