NIFTEM: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

|

Nov 07, 2021 | 7:40 AM

NIFTEM Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ,ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ పలు ఉద్యోగాల భర్తీకి..

NIFTEM: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
Niftem Recruitment
Follow us on

NIFTEM Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ,ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ టెక్నాలజీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. తంజావూర్‌లోని ఈ సంస్థలో ఉద్యోగులను తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా కాంట్రాక్ట్‌ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 18 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో సీనియర్‌ రీసెర్చ్‌/జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (13), ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ (03), యంగ్‌ ప్రొఫెషనల్‌ (02) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు ధరఖాస్తు చేసుకునే వారు పోస్టులను అనుసరించి.. సంబంధిత సబ్జెక్టుల్లో బీటెక్, ఎంటెక్‌ /ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. వీటితోపాటు పని అనుభవం తప్పనిసరి.

* పురుష అభ్యర్థులు 35 ఏళ్లు, మహిళలు 40 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాతపరీక్ష, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 20,000 నుంచి రూ. 31,000 + హెచ్‌ఆర్‌ఏ అందిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీగా 16-11-2021ని నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: SBI Customer Alert: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఇలా చేస్తే ఉచితంగానే రూ.2 లక్షల బీమా.. వివరాలు తెలుసుకోండి

Horoscope Today: ఈ రాశుల వారికి అనుకూల పరిస్థితులు.. ఈ రోజు రాశి ఫలాలు..

SBI ATM: మీరు ఎస్‌బీఐ ఏటీఎంకు వెళ్తున్నారా..? మీ మొబైల్‌ను వెంట ఉంచుకోండి.. ఎందుకంటే..!