National Dope Testing Recruitment: న్యూఢిల్లీలోని నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ (ఎన్‌డీటీఎల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 27-08-2021గా నిర్ణయించారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* మొత్తం 08 ఖాళీలకు గాను సైంటిస్ట్ డీ (01), సైంటిస్ట్ సీ (01), సైంటిస్ట్ బీ(06) ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* సైంటిస్ట్ డీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు డ్రగ్స్ అనాలసిస్‌కి సంబంధించిన వివిధ విభాగాల్లో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.
* ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు నెలకు రూ.1,19,132 జీతం చెల్లిస్తారు.
* సైంటిస్ట్ సీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు డ్రగ్స్ అనాలసిస్‌కి సంబంధించిన వివిధ విభాగాల్లో అనుభవం ఉండాలి. ఎంపికై అభ్యర్థులకు నెలకు రూ. 1,03,881 జీతంగా చెల్లిస్తారు. అభ్యర్థుల వయసు 40 ఏళ్లు మించకూడదు.
* సైంటిస్ట్ బీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. డ్రగ్స్ అనాలసిస్‌కి సంబంధించిన వివిధ విభాగాల్లో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు. ఎంపికైన వారికి నెలకు రూ. 87,525 జీతంగా చెల్లిస్తారు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ముందుగా అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* అభ్యర్థులు దరఖాస్తులను ది డిప్యూటీ డైరెక్టర్(అడ్మిన్), నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ (ఎన్‌డీటీఎల్) ఈస్ట్ గేట్ నెం.10, జేఎల్‌ఎన్ స్టేడియం కాంప్లెక్స్, లోథి రోడ్, న్యూఢిల్లీ–110003 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీగా 27-08-2021గా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Weather Forecast: ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు.. తెలంగాణలో నేడు ఈ ప్రాంతాలలో భారీ వర్షం
Pizza Delivery: ఆయన ఓ మాజీ ఐటీ మంత్రి.. ఇప్పుడు సైకిల్ పై పిజ్జాలు డెలివరీ చేస్తున్నారు!