
బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. పంజాబ్ నేషనల్ బ్యాంకు దేశ వ్యాప్తంగా వివిధ శాఖల్లో 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలైంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీజీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయోపరిమితి జనవరి 1,2024 నాటికి ఆఫీసర్ పోస్టులకు 21-28 ఏళ్లు, మేనేజర్ పోస్టులకు 25-35 ఏళ్లు, సీనియర్ మేనేజర్ పోస్టులకు 27-38 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.59, మిగతా అభ్యర్థులకు రూ.1180 రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాలి. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉంది.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి
మరిన్ని విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.