Teaching Posts: నల్లగొండ మహాత్మా గాంధీ వర్సిటీలో టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

Teaching Posts: మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. నల్లగొండలోని ఈ వర్సిటీ పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్.. బిజినెస్ మేనేజ్మెంట్‌లో...

Teaching Posts: నల్లగొండ మహాత్మా గాంధీ వర్సిటీలో టీచింగ్ పోస్టులు.. ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
nalgonda mahatma gandhi university

Updated on: Sep 16, 2022 | 6:46 PM

Teaching Posts: మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. నల్లగొండలోని ఈ వర్సిటీ పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్.. బిజినెస్ మేనేజ్మెంట్‌లో పార్ట్ టైమ్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనుంది. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా బీటెక్ ఈఈఈ, ఎంబీఏ, ఎంకాంలో ఉన్న టీచింగ్ పాస్టులను భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఎంబీఏ, నెట్, స్లెట్, సెట్ లేదా పీహెచ్ డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను పని అనుభవం, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తులను రిజిస్టర్, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, ఎల్లారెడ్డి గూడెం, నల్గొండ అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్‌ 28, 2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..