భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలొరి నైనిటాల్‌లోని నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్.. 10 ఐటీ ఆఫీసర్స్ గ్రేడ్/ స్కేల్-1 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి కనీసం 60 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్/ఐటీ స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్, కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పోస్టు గ్రాడ్యేయేషన్, ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు అక్టోబర్ 31, 2022వ తేదీ నాటికి 22 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో నవంబర్ 15, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవచ్చు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రూ.1500లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ప్రాతిపదికన తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.36,000ల నుంచి రూ.63,840వ వరకు జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్: The Vice President (HRM), The Nainital Bank Limited, Head Office, 7 Oaks Building, Mallital, Nainital-263001 (Uttarakhand).
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.