Telangana: నల్గొండ ఆటో గర్ల్ సభితకి మంత్రి కేటీఆర్ సాయం.. 2 బీహెచ్‌కే, ఆటో అందజేత!

కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుతోన్న నల్గొండ  (Nalgonda)జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతోన్న విద్యార్థిని సభిత (Sabhitha)కు మంత్రి కేటీఆర్ (KTR)అండగా నిలిచారు..

Telangana: నల్గొండ ఆటో గర్ల్ సభితకి మంత్రి కేటీఆర్ సాయం.. 2 బీహెచ్‌కే, ఆటో అందజేత!
Auto Girl Sabitha
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 09, 2022 | 6:42 PM

Nalgonda Auto Girl: కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుతోన్న నల్గొండ  (Nalgonda)జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతోన్న విద్యార్థిని సభిత (Sabhitha)కు మంత్రి కేటీఆర్ (KTR)అండగా నిలిచారు. సబిత తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోగా, ఆమె తల్లి నల్గొండలోని ఓ చిన్న రెస్టారెంట్‌లో పనిచేసేది. కుటుంబ పోషణ కోసం ఓ వైపు చదువుకుంటూనే ఆటో నడుపుతూ కుటుంబానికి అండగా నిలుస్తోంది. సబిత సంకల్ప శక్తికి, ఆత్మ విశ్వాసానికి ముగ్దులైన తెలంగాణ మంత్రి కేటీఆర్ నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్‌ను కలిసి సబితకు సహకరించాల్సిందిగా అభ్యర్థించారు. సబితను డైనమిక్ గర్ల్ అని, ఆమెను వ్యక్తిగతంగా కలుస్తానని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. గతంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి కేటీఆర్‌ ఈరోజు (ఫిబ్రవరి 9, 2022) హైదరాబాద్‌లో సబితను కలిసి 2 బీహెచ్‌కే ప్రొసీడింగ్స్‌, ఆటో రిక్షా అందజేశారు. ఈ సందర్భంగా సబిత ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు లక్ష్యాలను మంత్రి కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. సబిత చేస్తున్నది చిన్న పని కాదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటివి చేపట్టాలంటే చాలా కృషి, సంకల్ప శక్తి అవసరమని ఆయన అన్నారు. ఆమె పట్టుదల యువతకు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.

‘వాగ్దానం చేసినట్లుగా.. అత్యంత ఆత్మవిశ్వాసం కలిగిన సబితాను కలిశాను. ఆమె ఆలోచనలు, వ్యక్తీకరణల స్పష్టతతో ఆకట్టుకుంది. ఆమె అడిగిన విధంగా 2BHK ప్రొసీడింగ్, ఆటో రిక్షాలను అందజేశాం. ఆమె విద్యాభ్యాసానికి హామీ ఇచ్చాం. భవిష్యత్తులోనూ ఆమెకు అండగా ఉంటామని’ సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ ట్వీట్‌ చేశారు. కాగా సబిత సంతోషం వ్యక్తం చేస్తూ తనకు సహకరించిన మంత్రికి కృతజ్ఞతలు తెలియజేసింది. జీవితంలో పెద్ద లక్ష్యాలను సాధించడంలో ఇది తనకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆమె పేర్కొంది.

Also Read:

Railway Jobs: పదో తరగతి అర్హతతో రైల్వేలో భారీగా ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఉద్యోగాలు.. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపికలు!