ANGRAU Recruitment 2022: 8వ తరగతి అర్హతతో గుంటూరులో ఉద్యోగావకాశాలు.. ఇంటర్వ్యూ ఆధారంగానే..
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు (Guntur) జిల్లాలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ANGRAU)లో తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..
ANGRAU Guntur Lab Technician Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు (Guntur) జిల్లాలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ANGRAU)లో తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
ఖాళీల సంఖ్య: 7
ఖాళీల వివరాలు:
- ల్యాబ్ టెక్నీషియన్లు: 1
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బయోఫర్టిలైజర్స్ యూనిట్స్‌లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
పే స్కేల్: నెలకు రూ.15,000ల వరకు చెల్లిస్తారు.
- సెమీ స్కిల్డ్ లేబర్: 7
అర్హతలు: 8వ తరగతి/ అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్నవారు అర్హులు. బయోఫర్టిలైజర్స్ యూనిట్స్‌లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
పే స్కేల్: నెలకు రూ.12,000ల వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 17, 2022.
అడ్రస్: అగ్రికల్చరల్ స్టేషన్, అమరావతి, గుంటూరు. ఆంధ్రప్రదేశ్.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: