NEET UG 2021 Counselling: ఆ సర్టిఫికేట్‌ లేనికారణంగా అడ్మిషన్‌ క్యాన్సిల్‌ చేయొద్దు! అవసరమే కానీ తప్పనిసరేంకాదు..

|

Mar 08, 2022 | 8:06 AM

నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌లో సమర్పించవల్సిన డాక్యుమెంట్లలో మైగ్రేషన్ సర్టిఫికేట్ (Migration certificate) ముఖ్యమైనదే కానీ తప్పనిసరేమీ కాదని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) తాజాగా ప్రకటించింది..

NEET UG 2021 Counselling: ఆ సర్టిఫికేట్‌ లేనికారణంగా అడ్మిషన్‌ క్యాన్సిల్‌ చేయొద్దు! అవసరమే కానీ తప్పనిసరేంకాదు..
Neet Ug 2021
Follow us on

NEET UG 2021 admissions: నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌లో సమర్పించవల్సిన డాక్యుమెంట్లలో మైగ్రేషన్ సర్టిఫికేట్ (Migration certificate) ముఖ్యమైనదే కానీ తప్పనిసరేమీ కాదని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) తాజాగా ప్రకటించింది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను కౌన్సిల్‌ అధికారిక వెబ్‌సైట్ mcc.nic.inలో ప్రకటించబడింది. నోటిఫికేషన్ ప్రకారం.. మైగ్రేషన్ సర్టిఫికేట్ లేనికారణంగా ఏ మెడికల్‌ కాలేజ్‌ కూడా ఏ ఒక్క స్టూడెంట్‌ అడ్మిషన్‌ క్యాన్సిల్‌ చేయకూడదు. మైగ్రేషన్ సర్టిఫికేట్ లేని కారణంగా విద్యార్ధుల అడ్మిషన్‌ రద్దు చేయకుండా, 7 రోజుల వ్యవధిలో మైగ్రేషన్ సర్టిఫికేట్‌ను సమర్పించాలనే షరతుమీద వారికి ప్రవేశం కల్పించాలని పేర్కొంది. మైగ్రేషన్ సర్టిఫికేట్ సమర్పించే వరకు, విద్యార్ధులకు తాత్కాలిక ప్రాతిపదికన ప్రవేశం కల్పించాలని ఎమ్‌సీసీ కాలేజీలకు సూచించింది. కాగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG) 2021 కౌన్సెలింగ్‌కు సంబంధించిన రౌండ్ 2 సీట్ల కేటాయింపు ఫలితాలు ఫిబ్రవరి 26న విడుదలయ్యాయి. విద్యార్ధులు సీటు కేటాయించిన కాలేజీలో అడ్మిషన్‌ పొందేందుకు గానూ సమర్పించవల్సిన సర్టిఫికేట్లలో మైగ్రేషన్‌ సర్టిఫికేట్‌లేకపోతే, వారి ప్రవేశాన్ని రద్దు చేయకుండా, తాత్కాలిక ప్రాతిపదికన వారికి అడ్మిషన్‌ ఇవ్వాలనే విషయాన్ని స్పష్టం చేస్తూ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ అన్ని మెడికల్‌ కాలేజీలకు ఈ సందర్భంగా తెలియజేసింది.

Also Read:

RRB NTPC row: ఈ విషయంపై త్వరలోనే పరిష్కారం సూచిస్తాం.. రైల్వే శాఖ మంత్రి!