MIDHANI Jobs :హైదరాబాద్ లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ చెప్పింది ప్రముఖ సంస్థ మిథాని. 21 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 21 న నిర్వహించే ఇంటర్వ్యూకి ఆసక్తి కలిగి అర్హులైన అభ్యర్థులు నేరుగా ఇంటర్యూవుకు హాజరు కావచ్చోని తెలిపింది.
మొత్తం ఖాళీలు : 21
అర్హత : మెటలర్జికల్ ఇంజనీరింగ్( Metallurgical Engineering)లో డిప్లొమో
అనుభవం : ఏడాది పాటు ఇండస్ట్రీ అనుభవం
వయస్సు: ఏప్రిల్ 4 నాటికి 35 మించరాదు
జీతం: రూ. 27, 090
ఇంటర్వ్యూ కు హాజరైన అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం సర్టిఫికేషన్ వెరిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ ఒకే రోజు పూర్తి కాకపోతే ఎంపిక ప్రక్రియ మరుసటి రోజు సైతం కొనసాగుతుంది. ఇంటర్వ్యూ హాజరు కావలసిన చిరునామా
Brahm Prakash DAV School,
MIDHANI Township,
Hyderabad-500058
అభ్యర్థులు ఇంటర్వ్యూలకు ఉదయం 7. 30 గంటలకు హాజరుకావాల్సి ఉంటుంది. నిర్ణీత సమయం దాటిన తర్వాత ఇంటర్యూకు హాజరయ్యే అభ్యర్థులకు అనుమతి ఉండదని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇంటర్వ్యూకు తీసుకుని వెళ్లే అభ్యర్థులు డేట్ ఆఫ్ బర్త్, అనుభవం, ఈఎస్ఐ, ఈపీఎఫ్ స్టేట్మెంట్ లకు సంబంధించిన ధ్రువపత్రాలతో పాటు ఈఎస్ఐ, ఈపీఎఫ్ స్టేట్మెంట్లను వెంట తీసుకురావాల్సి వెళ్లాల్సి ఉంటుంది.
Also Read: బుల్లి తెరపై జ్ఞానాంబగా అడుగు పెట్టిన రాశి.. రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందంటే