Medical College Jobs: ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

|

Apr 01, 2022 | 10:30 AM

Medical College Jobs: నల్గొండలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. పలు విభాగాల్లో ఉన్న మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

Medical College Jobs: ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..
Govt Medical Jobs
Follow us on

Medical College Jobs: నల్గొండలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. పలు విభాగాల్లో ఉన్న మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (30), సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (10) ఖాళీలు ఉన్నాయి.

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం, తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. వీటితో పాటు ఎంసీఐ/ఎన్‌ఎంసీ గుర్తింపు తప్పనిసరి.

* సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ పోస్టులకు అప్లై చేసుకునే వారు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతో పాటు, తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 44 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.

* వాక్‌ ఇంటర్వ్యూలను 07-04-2022 తేదీన, గ్రీవియెన్స్‌ హాల్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌, కలెక్టర్‌ ఆఫీస్‌, నల్గొండ అడ్రస్‌లో నిర్వహించనున్నారు.

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 1,25,000, సివిల్ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు నెలకు రూ. 52,000 చెల్లిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Chicken Fight: రెండు వర్గాల మధ్య చికెన్‌ ముక్క చిచ్చు.. వేములవాడ మండలంలో రచ్చ రచ్చ..

New Rules: వినియోగదారులకు ముఖ్యమైన అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త నిబంధనలు..!

Telangana Schools: స్కూళ్లకు వేసవి సెలవులను ప్రకటించిన తెలంగాణ విద్యాశాఖ.. లాస్ట్‌ వర్కింగ్ డే ఎప్పుడంటే..