MANUU Recruitment: హైదరాబాద్‌ మౌలానా ఆజాద్‌ వర్సిటీలో టీచింగ్ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..

|

Jan 06, 2022 | 11:12 AM

MANUU Recruitment: మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో టీచింగ్‌ పోస్టులను..

MANUU Recruitment: హైదరాబాద్‌ మౌలానా ఆజాద్‌ వర్సిటీలో టీచింగ్ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక..
Follow us on

MANUU Recruitment: మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదరబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 88 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రొఫెసర్లు, అసొసియేట్‌ ప్రొఫెసర్లు (71), మోడల్‌ స్కూల్‌ టీచర్ (17) ఖాళీలు ఉన్నాయి.

* ప్రొఫెసర్‌ పోస్టుల్లో భాగంగా అరబిక్‌, హిందీ, ఇంగ్లిష్‌, ఉమెన్‌ ఎడ్యుకేషన్‌, పొలిటికల్‌ సైన్స్‌, ఇస్లామిక్‌ స్టడీస్, సోషల్‌ వర్క్‌, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, సోషియాలజీ పోస్టులు ఉన్నాయి.

* ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టీచింగ్ అనుభవం తప్పనిసరి.

* మోడల్ స్కూల్ టీచర్‌ పోస్టుల్లో భాగంగా హెడ్‌ మాస్టర్‌, టీజీటీ, పీజీటీ, యోగా టీచర్‌, ప్రైవరీ టీచర్‌ పోస్టులును భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అబ్యర్థులు ఆఫ్‌లైన్‌ విదానంలో దరఖాస్తు చేసుకోవాలి.

* దరఖాస్తులను రిజిస్టరర్‌, రూమ్‌ నెం10, అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దు యూనివర్సిటీ, ఉర్దు యూనివర్సిటీ రోడ్‌, గచ్చిబౌలి, హైదరబాద్‌ 500032 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను ముందుగా అకడమిక్‌ అర్హత, పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Australian Open: ప్రపంచ నం.1 ప్లేయర్‌కు షాక్.. ఆస్ట్రేలియాలో ఎంట్రీకి అనుమతి నిరాకరణ, వీసా రద్దు.. ఎందుకో తెలుసా?

AHA Unstoppable: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ఆహా అన్‌స్టాపబుల్‌.. తగ్గేదేలే అంటోన్న బాలయ్య..

Hair Care Tips: వింటర్ సీజన్‌లో జుట్టు సంరక్షణకు ఈ హోమ్‌మేడ్‌ చిట్కాలను ఇలా ట్రై చేయండి..