Mahesh Bank Recruitment: మహేశ్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.

|

Sep 12, 2021 | 9:05 AM

Mahesh Bank Recruitment 2021: హైదరాబాద్‌లోని మహేశ్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో ఉన్న...

Mahesh Bank Recruitment: మహేశ్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
Follow us on

Mahesh Bank Recruitment 2021: హైదరాబాద్‌లోని మహేశ్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో ఉన్న బ్రాంచుల్లో వివిధ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఈ మెయిల్‌ ద్వారా లేదా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 109 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌ వంటి పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌/ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు ఎంబీఏ/ సీఎఫ్‌ఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఏ/ సీఎస్‌/ సీఏఐఐబీ అర్హతలు ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు.
* అంతేకాకుండా సంబంధిత పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 40 నుంచి 53 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈమెయిల్‌ ద్వారా, ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు recruit@apmaheshbank.com మెయిల్‌ ఐడీకి దరఖాస్తు చేసుకోవాలి.
* ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకునే వారు.. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌, రోడ్‌ నెం. 12, ఆంధ్రప్రదేశ్‌ మహేశ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌, హెడ్‌ ఆఫీస్‌ అడ్రస్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీగా 24-09-2021 నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Vishal-Cm Jagan: ఆ ఆలోచన చేసిన సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్‌.. పొగడ్తల వర్షం కురిపించిన హీరో విశాల్.

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని పిఠాపురంలో అభిమానుల పూజలు..

Ganesh Chaturthi 2021: గణనాథుడి సేవలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ సన్నీ లియోన్.. ఇన్‌స్టాలో పోటోలు వైరల్..