Apply for Backlog Vacancies : ఐదవ తరగతి విద్యార్హత తో కలెక్టర్ ఆఫీస్‌లో ఉద్యోగావకాశాలు.. వివరాల్లోకి వెళ్తే

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ అనేక నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పలు ఉద్యోగాలకు...

Apply for Backlog Vacancies : ఐదవ తరగతి విద్యార్హత తో కలెక్టర్ ఆఫీస్‌లో ఉద్యోగావకాశాలు.. వివరాల్లోకి వెళ్తే

Edited By: Anil kumar poka

Updated on: Feb 22, 2023 | 5:19 PM

Krishna District Collector Office : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ అనేక నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తున్నాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వివిధ శాఖల్లో వికలాంగులకు రిజర్వ్ చేయబడిన వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

మొత్తం ఖాళీలు 41

గ్రూప్ 4 ఉద్యోగాలు 16

జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 13,
టైపిస్ట్ పోస్టులు 2
షరాఫ్ పోస్టు 1

విద్యార్హత :

ఉద్యోగానికి సంబంధించిన పోస్టును అనుసరించి పదో తరగతి, ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. ఎంఎస్ ఆఫీస్‌లో కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. తెలుగు, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్‌ పాసై ఉండాలి.

ఇక గ్రూప్ 4 కానీ టెక్నికల్ ఉద్యోగాలు ఆరు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎనిమిదో తరగతి పాసై ఉండాలి. సంబంధిత ట్రేడులో ఐటీఐ, పదో తరగతి, ఎంఎల్‌టీ కోర్సు, ఇంటర్, ఎంపీహెచ్ఏ లేదా శానిటరీ ఇన్‌స్పెక్టర్ కోర్సులో పాసై ఉండాలి.

క్లాస్ 4 ఉద్యోగాలు 19 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు చదవడం, రాయడంతో పాటు ఐదో తరగతి, ఏడో తరగతి పాసై ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో నింపిన అప్లికేషన్‌ను, విద్యార్హత పత్రాలను, క్యాస్ట్, రెసిడెన్స్, ఇన్‌కం సర్టిఫికెట్లను, స్టడీ సర్టిఫికెట్లను, రెండు ఫోటోలను అప్లికేషన్‌తో పాటు జత చేసి పంపించాలి. సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కలెక్టర్ కార్యాలయం, మచిలీపట్నం కృష్ణా జిల్లా అనే అడ్రస్‌కు పంపించాలి.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ లింక్‌పై క్లిక్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

Also Read:  ఆరేళ్ల బాలుడి కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్.. అనుమానితుడి ఫోటోల ఆదారంగా దర్యాప్తు ముమ్మరం..

బెంగాల్‌‌పై బీజేపీ స్పెషల్ ఫోకస్ .. రేపు బ్రిగేడ్‌ మైదానంలో మోదీ ర్యాలీ.. అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే ఛాన్స్

భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!