AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మార్చి 18

నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో భాగంగా దాదాపు అన్ని రంగాల్లో నిరుద్యోగులకు అవకాశం లభిస్తోంది. ఎప్పుడు ఏదో ఒక కంపెనీల్లో ఉద్యోగాలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌..

Subhash Goud
|

Updated on: Mar 06, 2021 | 11:27 PM

Share

నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో భాగంగా దాదాపు అన్ని రంగాల్లో నిరుద్యోగులకు అవకాశం లభిస్తోంది. ఎప్పుడు ఏదో ఒక కంపెనీల్లో ఉద్యోగాలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ జారీ అవుతోంది. ఇక తాజాగా హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషణ్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. టెక్నికల్‌ ఆఫీసర్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేస్తోంది.

మొత్తం 9 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ యూనిట్‌లో ఈ పోస్టులు భర్తీ కానున్నాయి. అయితే ఇవి ఏడాది గడువున్న కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఆ తర్వాత ప్రాజెక్ట్ అవసరాలను బట్టి గడువు పొడిగించే అవకాశం ఉంది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2021 మార్చి 18లోగా దరఖాస్తు చేసుకోవాలని సదరు సంస్థ తెలిపింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://www.ecil.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోచ్చు.

ఖాళీల వివరాలు ఇవే… మొత్తం ఖాళీలు- 9

టెక్నికల్ ఆఫీసర్- 8 సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ- 1 దరఖాస్తు ప్రారంభం- 2021 మార్చి 4 దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 18 అలాగే డాక్యుమెంట్ల పరిశీలన, ఇంటర్వ్యూ విద్యార్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు అర్హతలున్నాయి.

టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుకు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావాలి. వేతనం: సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ పోస్టుకు రూ.20,202, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు రూ.23,000. వయస్సు: సైంటిఫిక్ అసిస్టెంట్ ఏ పోస్టుకు 25 ఏళ్లు, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు 30 ఏళ్లు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

కాగా, అభ్యర్థులు ముందుగా http://www.ecil.co.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. Careers సెక్షన్‌లో e‐Recruitment పైన క్లిక్ చేయాలి. అందులో నోటిఫికేషన్ సెలెక్ట్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Apply for Various Posts పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత దరఖాస్తు చేయాలనుకునే పోస్టు సెలెక్ట్ చేయాలి. మీ పేరు, అడ్రస్, విద్యార్హతలు, ఇతర వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకోవాలి.

ఇవీ చదవండి :

PAN Card: ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులున్నాయా..? అయితే మీరు చిక్కుల్లో పడినట్లే.. భారీ పెనాల్టీ

Central Govt: కేంద్ర ప్రభుత్వం కీలక నోటిఫికేషన్ విడుదల.. ఏప్రిల్ 1 నుంచి అది తప్పనిసరి..