NIPER Kolkata Recruitment 2021: నైప‌ర్ కోల్‌క‌తాలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

|

May 21, 2021 | 3:01 PM

NIPER Kolkata Recruitment 2021: కోల్‌క‌తాలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(నైపర్‌) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా...

NIPER Kolkata Recruitment 2021: నైప‌ర్ కోల్‌క‌తాలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Niper Kolkata
Follow us on

NIPER Kolkata Recruitment 2021: కోల్‌క‌తాలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(నైపర్‌) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం 8 పోసుల్లో భాగంగా 4 టీచింగ్‌, 4 నాన్ టీచింగ్ పోస్టుల‌ను రిక్రూట్ చేయ‌నున్నారు.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* టీచింగ్ పోస్టుల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ (4) ఖాళీలను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా నేచురల్‌ ప్రొడక్ట్స్, ఫార్మాస్యూటిక్స్, మెడికల్‌ డివైజెస్ విభాగాల్లో ఉద్యోగుల‌ను తీసుకోనున్నారు. ఇక ఈ పోస్టుకు ద‌రఖాస్తు చేసుకునే వారు.. సంబంధిత స్పెషలైజేషన్లలో పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత విభాగంలో ఐదేళ్లు అనుభ‌వం ఉండాలి.

* నాన్ టీచింగ్ పోస్టుల్లో భాగంగా.. సిస్టమ్‌ మేనేజర్, వెటర్నరీ డాక్టర్, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్, రిజిస్ట్రార్‌ సెక్రటరీ, అసిస్టెంట్‌ గ్రేడ్‌–1 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అడ్మినిస్ట్రేషన్‌/అకడమిక్‌–ఎగ్జామినేషన్‌/స్పోర్ట్స్‌–పర్చేజ్, యానిమల్ హౌజ్‌, అడ్మినిస్ట్రేషన్ విభాగాలున్నాయి. ఇక అర్హ‌త విష‌యానికొస్తే.. అభ్య‌ర్థులు బ్యాచిలర్‌ డిగ్రీ, బీవీఎస్సీ, పీజీ(కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తును ది రిజిస్ట్రార్‌ ఐ/సి, నైపర్‌–కోల్‌కతా, చునిలాల్‌ భవన్, 168 మానికట్ల మెయిన్‌ రోడ్, కోల్‌కతా–700054, పశ్చిమ బెంగాల్‌ చిరునామాకు పంపించాలి.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది 11.06.2021 కాగా ద‌ర‌ఖాస్తు హార్డ్ కాపీ పంపించ‌డానికి 16.06.2021ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* అభ్య‌ర్థుల‌ను రాత పరీక్ష‌/ఇంట‌ర్వూఊ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Twitter Account: సోషల్ మీడియా ట్విట్టర్‌లో మీకు ఖాతా ఉందా.. అకౌంట్ తెరవాలంటే ఇలా చేయండి…

Bajaj Pulsar: బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ.40 వేలకే బజాజ్‌ పల్సర్‌ బైక్‌.. ఎక్కడో తెలుసా..?

TS 10th Results 2021: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల.. ఇలా చెక్ చేసుకోండి..