Teaching Jobs: కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ పోస్టులు.. వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..

|

Mar 13, 2022 | 9:38 AM

Teaching Jobs: సికింద్రాబాద్ కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖకి చెందిన కేంద్రీయ విద్యాలయం బొల్లారం, కేంద్రీయ విద్యాలయం హకీంపేటలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు...

Teaching Jobs: కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ పోస్టులు.. వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక..
Kendriya Vidyalaya
Follow us on

Teaching Jobs: సికింద్రాబాద్ కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖకి చెందిన కేంద్రీయ విద్యాలయం బొల్లారం, కేంద్రీయ విద్యాలయం హకీంపేటలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగులను తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా పీజీటీ, టీజీటీ, కంప్యూట‌ర్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్లు, ప్రైమ‌రీ టీచ‌ర్లు, స్పోర్ట్స్ కోచ్‌లు, డాక్ట‌ర్‌, స్టాఫ్ న‌ర్స్‌, యోగా కోచ్‌, స్పెష‌ల్ ఎడ్యుకేట‌ర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* హిందీ, ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, హిస్ట‌రీ, జియోగ్రఫీ, ఎక‌నామిక్స్‌, కామ‌ర్స్, సైన్స్, సోష‌ల్ సైన్స్ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాసస్తు చేసుకునే వారు సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంట‌ర్మీడియ‌ట్‌/త‌త్సమాన‌, డిగ్రీ/డిప్లొమా, గ్రాడ్యుయేష‌న్‌, బీఏ/బీఎస్సీ, న‌ర్సింగ్ డిప్లొమా, న‌ర్సింగ్‌(బీఎస్సీ), ఎంఏ/ఎమ్మెస్సీ, మాస్టర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్‌, డీఈడీ, బీఈడీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత‌ సాధించి ఉండాలి. వీటితో పాటు అభ్యర్థులు ఎంసీఐలో రిజిస్టర్ అయి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూలను 15-03-2022, 16-03-2022 తేదీల్లో నిర్వహించనున్నారు.

* ఇంటర్వ్యూలను కేవీ బొల్లారం, అల్లెన్బీ లైన్స్‌, జేజే నగర్‌, యాప్రాల్‌, సికింద్రాబాద్‌ 50087 అడ్రస్‌లో నిర్వహిస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 21,250 నుంచి రూ. 27,500 వరకు చెల్లిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Crude Oil: ఆయిల్ ధరలతో లాభపడనున్న ఆ వ్యాపారవేత్త.. కొత్తగా దేశంలో భారీ పెట్టుబడులు..

PAN Alert: పాన్ కార్డ్ అలా వాడుతున్నారా? వెంటనే జాగ్రత్తపడకపోతే బుక్కైపోతారు..

Gold Price Today: బంగారం ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌.. భారీగా పెరిగిన ధరలు.. ఎంత పెరిగిందంటే..