PJTSAU Recruitment 2022: సంగారెడ్డి జిల్లా కందిలోని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయం విశ్వవిద్యాలయ పరిధికి చెందిన ఈ కాలేజీలో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీల భర్తీ కోసం సోమవారం (29-08-2022) ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్న నేపథ్యంలో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో టీచింగ్ అసోసియేట్ (ఫుల్ టైం) – 05, టీచింగ్ అసోసియేట్ (పార్ట్ టైం) – 05 ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్/ సాయిల్ అండ్ వాటర్ ఇంజినీరింగ్/ ఫార్మ్ మెషినరీ/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్), ఎంఎస్సీ(అగ్రికల్చర్/ ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ ఇంగ్లిష్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.
* ఇంటర్వ్యూలను కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, కంది, సంగారెడ్డి జిల్లా అడ్రస్‌లో నిర్వహిస్తారు.
* ఇంటర్వ్యూలను 29-08-2022 తేదీన ఉదయం 11 గంటల నుంచి నిర్వహించనున్నారు.
* ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లతో హాజరుకావాల్సి ఉంటుంది.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..