Kalpana Chawla Fellowship: అంతరిక్షంలోకి వెళ్ళాలని కలలలు కంటున్న యువతుల కోసం కల్పనా చావ్లా ఫెలోషిప్

|

Oct 20, 2021 | 7:23 PM

మన దేశపు తొలి మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా ఎందరికో చంద్రునిపైకి వెళ్ళాలనే కలను మెరిపించింది. ఆమె స్ఫూర్తితో ఎందరో ఆడపిల్లలు అంతరిక్ష యానం చేయాలని.. చంద్రుని చూడాలని కలలు కన్నారు.

Kalpana Chawla Fellowship: అంతరిక్షంలోకి వెళ్ళాలని కలలలు కంటున్న యువతుల కోసం కల్పనా చావ్లా ఫెలోషిప్
Kalpana Chawla Fellow Ship
Follow us on

Kalpana Chawla Fellowship: మన దేశపు తొలి మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా ఎందరికో చంద్రునిపైకి వెళ్ళాలనే కలను మెరిపించింది. ఆమె స్ఫూర్తితో ఎందరో ఆడపిల్లలు అంతరిక్ష యానం చేయాలని.. చంద్రుని చూడాలని కలలు కన్నారు. ఇప్పటికీ కల్పనా చావ్లా చిత్రాలను చూసిన చాలామంది బాలికలు తాము కూడా ఆమెలా నింగిలోకి వెళ్లి రావాలని కోరుకుంటారు. అయితే, దానికి కావలసిన ఆర్ధిక సహకారం లేక వారి కలలు అలానే వారితోనే ఉండిపోతాయి. కానీ, ఇప్పుడు అలా వారి కలల్ని చేరిపెసుకోనవసరం లేదు. కల్పనా చావ్లా జ్ఞాపకార్ధం ఆమె స్నేహితులు ఫెలోషిప్ ప్రారంభించారు. దీని కింద సైన్స్ రంగంలో ప్రతిభావంతులైన భారతీయ యువతులను చంద్రునిపైకి తీసుకెళ్ళడానికి అవకాశం కల్పిస్తారు. దీని తర్వాత అంతరిక్షంలో మహిళల ప్రాబల్యం పెరుగుతుంది. ప్రస్తుతం, మొత్తం వ్యోమగాములలో 89 శాతం మంది పురుషులు ఉన్నారు. కేవలం 1 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు.

కల్పనా చావ్లా స్నేహితులు ఆమె దృష్టిని సాకారం చేయడానికి ‘చావ్లా ప్రాజెక్ట్ ఫర్ ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్యిజం అండ్ స్పేస్ స్టడీస్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా, సైన్స్ రంగంలో భారతదేశంలో ఎంపికైన, ప్రతిభావంతులైన మహిళలు అంతర్జాతీయ వేదికపై అవకాశం పొందవచ్చు. ”మీకు కల ఉంటే, దాన్ని నిజం చేయడానికి ప్రయత్నించండి. మీరు భారతదేశానికి చెందినవారైనా, మరెక్కడి నుంచైనా.. మీరు స్త్రీ అయినా పరవాలేదు.” అని కల్పనా చావ్లా చెబుతుండేవారు.

ఏ మహిళలు ప్రయోజనం పొందుతారు?

ఈ ఫెలోషిప్ ఉద్దేశ్యం సైన్స్, మెడిసిన్, మెటీరియల్స్, శాటిలైట్ టెక్నాలజీ, స్పేస్ సంబంధిత సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన భారతీయ మహిళలకు అవకాశాలు కల్పించడమే. వ్యోమగామి కల్పనా చావ్లా లాగా ఆలోచించే , వారిలాంటి విద్య, నైపుణ్యాలపై మక్కువ ఉన్న మహిళలకు దీనిద్వారా అవకాశం దొరుకుతుంది. ఈ ఫెలోషిప్ ద్వారా వారి అంతరిక్ష కలలను నెరవేర్చుకోవచ్చు.

ఒక మహిళా వ్యోమగామి మొదటిసారి అంతరిక్షానికి ఎప్పుడు చేరుకుంది?

సోవియట్ వ్యోమగామి యూరి గగారిన్ ఏప్రిల్ 12, 1961 న అంతరిక్షానికి వెళ్ళిన ప్రపంచంలో మొదటి వ్యక్తి అయ్యారు. రెండు సంవత్సరాల తరువాత, సోవియట్ యూనియన్‌కు చెందిన వాలెంటినా తెరష్కోవా ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా వ్యోమగామిగా అంతరిక్షంలోకి అడుగు పెట్టారు. ఆమె జూన్ 16, 1963 న అంతరిక్షంలోకి వెళ్లారు. తెరష్కోవా భూమిని 48 సార్లు ప్రదక్షిణ చేసి, మూడు రోజుల తర్వాత భూమికి తిరిగి వచ్చారు. ఆమె తన పేరు మీద రెండు రికార్డులు సృష్టించారు. మొదటిది- ప్రపంచంలో మొదటి మహిళా వ్యోమగామి. రెండవది- 71 గంటలు అంతరిక్షంలో నివసించారు. ఈ సమయం అంతరిక్షంలో సుదీర్ఘ కాలం రికార్డు.

60 సంవత్సరాలలో కేవలం 65 మంది మహిళలు మాత్రమే..

తెరేష్కోవా తర్వాత, ప్రపంచవ్యాప్తంగా మహిళలు అంతరిక్ష నడకలో వెళ్లాలని కలలు కన్నారు. కానీ దాదాపు 20 సంవత్సరాల పాటు మరే ఇతర మహిళ ఈ రంగంలోకి ప్రవేశించలేదు. 1980 ల తరువాత, మహిళలు ఈ దిశలో చురుకుగా మారారు. రష్యాకు చెందిన బాల స్వెత్లానా సావిట్స్కాయ అంతరిక్షానికి చేరుకున్నారు. ఆమె రెండవ మహిళా వ్యోమగామి మాత్రమే కాదు, అంతరిక్షంలో నడిచిన మొదటి మహిళ కూడా.

అంతరిక్షంలోకి మానవుడు అడుగుపెట్టి 60 సంవత్సరాలు గడిచినప్పటికీ, కొద్దిమంది మహిళలు మాత్రమే అంతరిక్షంలో ప్రయాణించగలిగారు. ఒక నివేదిక ప్రకారం, ఇప్పటివరకు 566 మంది అంతరిక్షంలోకి వెళ్లారు. అందులో 65 అంటే 11.5% మహిళలు. వీరిలో ఎక్కువమంది అమెరికన్ మహిళలు ఉన్నారు.

మన దేశం నుంచి..

భారతీయ సంతతి కల్పనా చావ్లా, సునీత విలియమ్స్, శిరీష బండ్ల అంతరిక్షంలో చరిత్ర సృష్టించిన మహిళల్లో ఉన్నారు. దేశంలోని మొదటి మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా భూమికి తిరిగి వస్తున్న సమయంలో ఫిబ్రవరి 1, 2003 న జరిగిన ప్రమాదంలో మరణించారు.

వ్యోమగామిగా మారడం ఎలా?

వ్యోమగామి కావడానికి, ఎవరైనా ఇంజనీరింగ్, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ లేదా మ్యాథమెటిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే, మూడేళ్ల ప్రొఫెషనల్ అనుభవం ఉండాలి. పాల్గొనేవారు నాసా వ్యోమగామి భౌతిక పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి. స్కూబా డైవింగ్, జంగిల్ వాకింగ్, నాయకత్వం, అనేక భాషల పరిజ్ఞానం వంటి అనేక ఇతర నైపుణ్యాలు ఎంపికలో మీకు సహాయపడతాయి. నాసా వ్యోమగాములుగా ఎంపికైన వారిని శిక్షణ కోసం పిలుస్తారు.

ఇవి కూడా చదవండి: Telegram App: వంద కోట్ల డౌన్‌లోడ్‌లతో దూసుకుపోతున్న టెలిగ్రామ్ యాప్.. పదిహేను రోజుల్లో భారీగా చేరిన యూజర్లు..

Future Tech 2021: భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో ఫ్యూచర్ టెక్ 2021 ఈవెంట్.. ఆన్‌లైన్‌లో మీరూ పాల్గొనవచ్చు ఇలా!

India vs Pakistan: పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన దుబాయ్.. కాశ్మీర్‌‌లో మౌలిక సదుపాయాల కోసం భారీ పెట్టుబడులు!